ఏపీలో ఎన్నికలు జరగని పంచాయితీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల పర్వంలో టీడీపీ-వైసీపీ మధ్య ఘర్షణలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ఎన్నికల ఉపసంహరణ ప్రక్రియలో 8వ వార్డు ఉపసంహరణ విషయంలో మొదటినుండి హై డ్రామా నడిచింది. 8వ వార్డు టీడీపీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించు కున్నాడని వైసీపీ అభ్యర్థి ఒక్కరే బరిలో ఉండటంతో ఏకగ్రీవంగా ప్రకటించారు. 8వవార్డులో తండ్రి కొడుకులు ఇద్దరూ టీడీపీ తరుపున పోటీ చేశారు. ఉపసంహరణలో…
సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా స్టువర్టుపురం-ఈపూరుపాలెం మధ్య చెన్నై వెళ్తున్న మార్గంలో రైలు పట్టా విరిగింది. రైలు పట్టా విరగడాన్ని గమనించిన రైల్వే గస్తీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే ఈ సమాచారాన్ని అధికారులకు చేరవేశారు. దీంతో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వే అధికారులు స్టువర్టుపురం స్టేషన్‌లోనే నిలిపివేశారు. దీంతో మంగళవారం అర్ధరాత్రి 1:30 గంటల నుంచి 3:30 గంటల వరకు రైలు స్టువర్టుపురం స్టేషన్‌లోనే…
గత రెండు రోజులుగా చందానగర్ యువతి ఆత్మహత్య కేసు ఎంతటి సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నర్సు నాగచైతన్య హోటల్ రూమ్ లో రక్తపు మడుగులో పోలీసులకు కనిపించింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. విచారణ ముమ్మరం చేశారు. రెండు రోజులు గాలించి ప్రియుడు కోటిరెడ్డిని అరెస్ట్ చేసి విచారించగా.. నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. తానే తన ప్రియురాలిని హత్య చేసినట్లు కోటిరెడ్డి ఒప్పుకోవడం ఇంకా సంచలనంగా మారింది. ఈ…
వెలిగొండ ప్రాజెక్టును కేంద్ర గెజిట్‌లో చేర్చాలన్నది ప్రకాశం టీడీపీ నేతల డిమాండ్. ఇదే అంశంపై రెండు రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. అక్కడితో ఆగితే బాగోదని అనుకున్నారో ఏమో సడెన్‌గా ఢిల్లీ వెళ్లారు. కాకపోతే హస్తిన పర్యటనను రహస్యంగా ఉంచడమే చర్చగా మారింది. ఎందుకు గోప్యత పాటించారు? ప్రకాశం టీడీపీ నేతలకు వచ్చిన ఇబ్బందేంటి? ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి షెకావత్‌ను కలిసిన ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు! ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టుపై ఆ జిల్లా టీడీపీ…
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. తుర్లపాడు మండలం రోలుగుంపాడులోని ఎస్టీ కాలనీ వద్ద టాటా ఏస్ వాహనం బోల్తా పడిన ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మృతిచెందారు.. రోడ్డుపై చనిపోయిన గేదెపైకి దూసుకెళ్లిన టాటా ఏస్ వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది.. స్పాట్‌లోనే ఐదుగురు మృతిచెందగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయినట్టుగా చెబుతున్నారు.. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.. క్షతగాత్రులను చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖరాశారు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు.. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో పునర్ సమీక్ష చేయాలని లేఖలో కోరారు.. వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతులు లేవని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భావిస్తోందని లేఖలో ప్రశ్నించిన టీడీపీ ఎమ్మెల్యేలు.. కేంద్ర ప్రభుత్వానికి, కృష్ణా నది యాజమాన్య బోర్డుకు.. తెలంగాణ సర్కార్ రాసిన లేఖలు వెనక్కి తీసుకోవాలని కోరారు.. అయితే, గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టు పేరు లేకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్యేలు.. 2014…
పతియే ప్రత్యక్ష దైవం అని నమ్మింది ఆ మహిళ. భర్త మరణానంతరం కూడా పూజిస్తూ.. ఆయన సేవకే అంకితమైంది. ప్రకాశం జిల్లా పొదిలి మండలం నిమ్మవరం గ్రామానికి చెందిన అంకిరెడ్డి, పద్మావతికి 21 సంవత్సరాల క్రితం వివాహమైంది. దురదృష్టవశాత్తు నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు అంకిరెడ్డి. తన భర్త మరణానంతరం ఆయనకు ఏకంగా గుడి కట్టి.. నిత్యం పూజలు చేస్తుంది అతని భార్య. అంతేకాదు ప్రతి పౌర్ణమి, శని, ఆదివారాలలో పేదలకు అన్నదానం కూడా…
ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోయినా.. ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తుందని ఇన్నాళ్లూ ఆశించారు. చివరకు ఆ ముచ్చట కూడా అయిపోయింది. రాష్ట్రస్థాయి పదవి కాదు కదా.. కనీసం జిల్లా స్థాయి పోస్టుల్లోనూ వారికి చోటు దక్కలేదు. ఏదో ఆశిస్తే.. ఇంకేదో అయిందని వాపోతున్నారట సీనియర్లు. మెడలో కండువా ఉన్నా.. చేతిలో పదవి లేక తెగ మథన పడుతున్నారట. ఆ సంగతేంటో ఇప్పుడు చూద్దాం. పార్టీ పెద్దల దృష్టిలో ఉన్నారా .. లేరా? వైసీపీ ఆవిర్భావం…
ప్రకాశం జిల్లాకు అన్యాయం జరుగుతోందని లేఖలు రాసిన టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు యూ టర్న్ తీసుకున్నారు? 24 గంటల్లో వారికి ఏమైంది? తడబడ్డారా.. తొందపాటుతో ఇరుకున పడ్డారా? ఏదో చేయబోతే.. ఇంకేదో అయ్యిందా? సీమ ప్రాజెక్టులపై ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల లేఖ తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం నీటి యుద్ధం జరుగుతోంది. నీరే నిప్పుగా మారిన పరిస్థితి. రాజకీయంగా సున్నితమైన ఈ అంశంపై ఆచితూచి స్పందిస్తోంది టీడీపీ. ఇలాంటి సమయంలో ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు…
రాజకీయాల్లో రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. నిన్నటి వరకు మిత్రులైన వారు శత్రువులుగా మారొచ్చు. ఇన్నాళ్లు ఎడముఖం పెడముఖంగా ఉన్నవాళ్లు సడెన్‌గా దోస్తీ చేయొచ్చు. అధికార పార్టీకి చెందిన ఆ మంత్రి, ఎంపీలకు ఈ సూత్రం అతికినట్టు సరిపోతుంది. 2019లో కలిసి ఉన్నవారి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కోల్డ్‌వార్‌కు తెరతీశారు. ఇంతకీ ఎవరా నాయకులు? మంత్రి బాలినేని.. ఎంపీ మాగుంట మధ్య కోల్డ్‌వార్ ప్రకాశం జిల్లా వైసీపీలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య గరంగరం…