చందానగర్ హత్యకేసులో వీడిన మిస్టరీ.. ప్రియుడే హంతకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత రెండు రోజులుగా చందానగర్ యువతి ఆత్మహత్య కేసు ఎంతటి సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నర్సు నాగచైతన్య హోటల్ రూమ్ లో రక్తపు మడుగులో పోలీసులకు కనిపించింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. విచారణ ముమ్మరం చేశారు. రెండు రోజులు గాలించి ప్రియుడు కోటిరెడ్డిని అరెస్ట్ చేసి విచారించగా.. నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. తానే తన ప్రియురాలిని హత్య చేసినట్లు కోటిరెడ్డి ఒప్పుకోవడం ఇంకా సంచలనంగా మారింది. ఈ ఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రకాశం జిల్లా ఒంగోలు గ్రామానికి చెందిన నాగ చైతన్య(24) నల్లగండ్లలోని సిటిజన్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తోంది. గుంటూరుకు చెందిన కోటిరెడ్డి మెడికల్ రిప్రజెంటివ్ గా నాగ చైతన్య పనిచేస్తున్న ఆసుపత్రిలోనే చేరాడు. అక్కడే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.. కొద్దీ రోజులలోనే ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. కానీ ఇద్దరి కులాలు వేరు కావడంతో వీరి పెళ్ళికి ఇంట్లో ఒప్పుకోలేదు. దీంతో ఆరు నెలల నుంచి నాగ చైతన్య, కోటిరెడ్డిపై పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెచ్చింది. దీంతో కోపోద్రిక్తుడైన కోటిరెడ్డి, ప్రియురాలిని చంపితే కానీ సమస్య తీరదనుకున్నాడు. అనుకున్నదే తడవుగా హైదరాబాద్ లో ఉంటున్న ప్రియురాలి దగ్గరకు వచ్చి ఈ నెల 22 న ఆమెను తీసుకొని లాడ్జిలో ఒక రూమ్ తీసుకున్నాడు.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
స్విగ్గిలో ఫుడ్ ఆర్డర్ పెట్టి, మందు తాగి రాత్రంతా రచ్చ చేశాడు. 23 వ తేదీ అర్ధరాత్రి కోటిరెడ్డి రక్తపు మడుగులో ఒంగోలులో ఉన్న జీజీహెచ్ లో కనిపించాడు. ఏమైంది అని అడుగగా.. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని.. ఇద్దరూ కలిసి.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. కత్తి పోట్ల తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు ఆ తర్వాత ఏమైందో తెలియని అన్నాడు. ఇటు పక్క రెండు రోజులు అవుతున్నా గది తలుపులు తెలవకపోవడంతో అనుమానించిన హోటల్ సిబ్బంది తాళం పగలకొట్టి చూడగా రక్తపు మడుగులో నాగ చైతన్య కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కోటిరెడ్డిపై అనుమానంతో అతడిని తమదైన రీతిలో విచారించగా తానే గొంతుకోసి ప్రియురాలిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. నాగ చైతన్య ఒంటిపై కత్తి పోట్లు ఉన్నాయని, అది ఆత్మహత్యలా అనిపించలేదని తెలిపారు. అంతకుముందే కోటి రెడ్డి ఓ సూపర్ మార్కెట్‌లో కత్తి, తాడు కొనుగోలు చేసినట్లు తెలిపారు. రాత్రి ఇద్దరు మద్యం సేవించిన తర్వాత ఘర్షణ చోటుచేసుకుందని, ఆ ఘర్షణ లోనే కోటి రెడ్డి, నాగ చైతన్యను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!