ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం మండలం మురారిపల్లెలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శిలాఫలకంలో తమ నాయకుడి పేరు లేకపోవడంతో.. వైసీపీ వర్గాల మధ్య చిచ్చు రేగింది. పోలీసులు రంగంలోకి దిగేదాకా.. ఈ రగడ అదుపులోకి రాలేదు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఏపీ ప్రభుత్వం ఈరోజు నుంచి రాష్ట్రంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే! ఇందులో భాగంగా గ్రామంలో స్కూల్ భవన నిర్మాణానికి శిలాఫలకాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. అయితే.. ఆ శిలాఫలకంలో స్కూల్…
ప్రకాశం జిల్లా ఒంగోలు లోక్‌సభ సెగ్మెంట్. ఇప్పటి వరకూ 17సార్లు ఎన్నికలు జరిగాయి. టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన పది ఎన్నికల్లో కేవలం రెండుసార్లు మాత్రమే సైకిల్ గెలిచింది. ఒకసారి బెజవాడ పాపిరెడ్డి.. మరోసారి కరణం బలరామ్‌లే టీడీపీ ఎంపీలుగా గెలిచారు. మొదటి నుంచి కాంగ్రెస్‌కు.. తర్వాత వైసీపీకి పెట్టని కోటలా మారింది ఒంగోలు లోక్‌సభ స్థానం. పైగా ఇక్కడ అభ్యర్థిని బరిలో దించాలంటే టీడీపీకి తలకు మించిన భారంగా ఉంటోందట. ఎన్నికల్లో ఎవరో ఒకర్ని నియమించడం..…
ప్రకాశం జెడ్పీ సమావేశం వినూత్నంగా జరిగింది. జిల్లాల పునర్విభజన తర్వాత జరిగిన తొలి సమావేశంలో పలు ప్రత్యేకతలు కనిపించాయి. ప్రకాశం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు నెల్లూరు, బాపట్ల జిల్లాలకు వెళ్లటంతో ఆ జిల్లాల అధికారులు కూడా హాజరయ్యారు. జిల్లాల పునర్విభజన జరిగినా జెడ్పీ పాలకవర్గం విడిపోకపోవటంతో జెడ్పీ సమావేశానికి భార్యాభర్తలైన ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లతో నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు. మొదటి సారి ఇలాంటి సన్నివేశం జరగడంతో ఏ జిల్లాలోకి వెళ్లిన మండలాల సమస్యలను…
ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒంగోలు బైపాస్ రోడ్డులోని ఉడ్ కాంప్లెక్స్ శివారులో పార్కింగ్ చేసి ఉన్న కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సులో తొలుత మంటలు చెలరేగగా.. ఆ మంటలు నెమ్మదిగా పక్కన ఉన్న బస్సులకు కూడా వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 8 ప్రైవేట్ బస్సులు అగ్నికి ఆహుతి అయ్యాయని తెలుస్తోంది. ఈ ప్రమాదంపై వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా…
కర్ణాటకలోని జిల్లాలో కుందాపూర్, ఉడుపి, బిందూర్‌లో మొదలైన హిజాబ్ వివాదం.. క్రమంగా మిగతా ప్రాంతాలకు పాకింది.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ను కూడా తాకింది.. బుర్కా వేసుకొచ్చామన్న కారణంతో కాలేజీ యాజమాన్యం అనుమతించడం లేదంటూ విజయవాడలోని లయోలా కాలేజీలో ముస్లిం విద్యార్థినులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.. బుర్కా వేసుకొచ్చారన్న కారణంతో లోపలికి అనుమతించడం లేదంటూ విద్యార్థినులు తెలిపారు.. దీనిపై విద్యార్థినుల కుటుంబసభ్యులు, ముస్లిం పెద్దలు కూడా ఆందోళన చేసిన సంగతి మరువక ముందే.. ఇప్పుడు మరో చోట హిజాబ్…
చేసేదే అక్రమం. ఆ అక్రమాన్ని అడ్డంగా క్యాష్ చేసుకుంటున్నారు ఆ చోటామోటా నేతలు. బిజినెస్ బాగుండటం.. గిట్టుబాటు అవుతుండటంతో కొత్త కొత్త ముఠాలు ఈ దందాలో చేరిపోతున్నాయి. పోటీ పెరగడంతో ఒకరి రహస్యాలను ఇంకొకరు పోలీసుల చెవిన వేస్తూ పెద్ద నేతలకు తలనొప్పిగా మారారట. వేలకు వేలు వస్తుండటంతో కొత్త ముఠాలు ఎంట్రీప్రకాశం జిల్లాలో కొత్తరకం దందాకు తెరలేచింది. ‘జిల్లా’లో తరలించే గ్రానైట్ లారీల నుంచి వైసీపీ ద్వితీయశ్రేణి నేతలు వసూళ్లు మొదలుపెట్టారు. ఎప్పుడు ఏ లారీ…
ఏపీలోని గ్రామ సచివాలయాల్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఈ మేరకు సాఫ్ట్‌వేర్ లీలలు బయటపడుతున్నాయి. కుల ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేస్తే ఏ సామాజిక వర్గం వారికైనా ఎస్టీ సర్టిఫికెట్ జారీ అవుతోంది. దీంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన షేక్ షబ్బీర్ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ కోసం స్థానిక సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి ఆయన దరఖాస్తుకు ఆమోదం తెలిపారు. అయితే సదరు వ్యక్తి షేక్…
నవ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం ప్రకాశం జిల్లాలో విషాదంగా మారింది.. పెళ్లి చేసుకుని నెల దాటిందో లేదో.. అప్పుడే ఆ ఇద్దరు దంపతులు ప్రాణాలు తీసుకోవడం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది డిసెంబర్ 29వ తేదీన ప్రియాంక-మహానందికు వివాహం జరిపించారు పెద్దలు.. ఛత్తీస్‌గఢ్‌లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు మహానంది.. అయితే, వారి కుటుంబంలో కలహాలు ఏర్పడినట్టుగా తెలుస్తోంది.. దీంతో.. ఇద్దరూ ప్రాణాలు తీసుకున్నారు.. దీంతో ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం…
ఏపీ వ్యాప్తంగా సంచలనం కలిగించింది ప్రకాశం జిల్లా టంగుటూరులో జరిగిన తల్లీకూతుళ్ళ దారుణ హత్యకేసు. టంగుటూరు తల్లీకూతుళ్ళ డబుల్ మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు.హత్యకేసులో నిందితులను గుర్తించారు పోలీసులు. డిసెంబర్ 3న టంగుటూరులో దారుణ హత్యకు గురయ్యారు తల్లీకూతుళ్లు శ్రీదేవి, శ్రీలేఖ. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పోలీసులు. నిందితులు కందుకూరుకు చెందిన పాత నేరస్తులు శివకోటయ్య, కిషోర్ గా గుర్తించారు పోలీసులు. నిందితులు హత్యకు నాలుగు రోజులు రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. ఒంటరిగా ఉన్న తల్లీకూతుళ్ళను…
హిందూ దేవాలయాల వద్ద అన్యమత చిహ్నాలు దారుణం.. వాటిని వెంటనే తొలగించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామంలో తిరుమల స్వామి దేవాలయం వద్ద అన్యమత చిహ్నాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. శతాబ్దాలుగా సంతానం కలగని దంపతులకు ఇక్కడకొచ్చి గిరి ప్రదక్షిణ చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం భక్తుల్లో ఉందన్నారు. Read Also: నేరగాళ్లకు ఏపీ ఫ్రెండ్లీ స్టేట్‌గా…