పతియే ప్రత్యక్ష దైవం అని నమ్మింది ఆ మహిళ. భర్త మరణానంతరం కూడా పూజిస్తూ.. ఆయన సేవకే అంకితమైంది. ప్రకాశం జిల్లా పొదిలి మండలం నిమ్మవరం గ్రామానికి చెందిన అంకిరెడ్డి, పద్మావతికి 21 సంవత్సరాల క్రితం వివాహమైంది. దురదృష్టవశాత్తు నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు అంకిరెడ్డి. తన భర్త మరణానంతరం ఆయనకు ఏకంగా గుడి కట్టి.. నిత్యం పూజలు చేస్తుంది అతని భార్య. అంతేకాదు ప్రతి పౌర్ణమి, శని, ఆదివారాలలో పేదలకు అన్నదానం కూడా చేస్తుంది. అలాగే ప్రతి ఏటా గురుపౌర్ణమికి అంకిరెడ్డి పేరుమీద, ఆమె పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా పెట్టుకుంది.