సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా స్టువర్టుపురం-ఈపూరుపాలెం మధ్య చెన్నై వెళ్తున్న మార్గంలో రైలు పట్టా విరిగింది. రైలు పట్టా విరగడాన్ని గమనించిన రైల్వే గస్తీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే ఈ సమాచారాన్ని అధికారులకు చేరవేశారు. దీంతో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వే అధికారులు స్టువర్టుపురం స్టేషన్‌లోనే నిలిపివేశారు. దీంతో మంగళవారం అర్ధరాత్రి 1:30 గంటల నుంచి 3:30 గంటల వరకు రైలు స్టువర్టుపురం స్టేషన్‌లోనే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా రైల్వే సిబ్బంది మరమ్మతుల అనంతరం రైళ్ల రాకపోకలను అధికారులు యథాతథంగా అనుమతిస్తున్నారు.
Read Also: తగ్గేదే లే.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు