పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. ఇప్పటికే యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఎ.ఎం. రత్నం సమర్పణలో ఆయన సోదరుడు దయాకర్ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ నాయికగా నటిస్తున్న పిరియాడిక్ మూవీ ‘హరిహర వీరమల్లు’ తాజా షెడ్యూల్ కొత్త సంవత్సరంలో మొదలు కానుంది. దీనికి సంబంధించిన పనులను దర్శకుడు క్రిష్ చకచకా చేస్తున్నారు. తాజాగా స్క్రిప్ట్ రీడింగ్ సెషన్ ను పవన్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం భీమ్లా నాయక్ చిత్రంతో బిజీగా ఉన్నాడు ఈ సినిమా తరువాత వరుస సినిమాలను లైన్లో పెట్టిన పవన్ మరోవైపు నిర్మాతగా కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సినిమాలను నిర్మాతగా మారి రిలీజ్ చేశాడు.. ఒకటి సర్దార్ గబ్బర్ సింగ్ కాగా , రెండోది నితిన్ నటించిన చల్ మోహన్ రంగ చిత్రాలను నిర్మించారు. అయితే ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. పవన్ కల్యాణ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు, మరోపక్క రాజకీయాలతో బిజీగా మారిపోయాడు.. వరుస సినిమాలను ఒప్పుకొంటూనే రాజకీయాలలోని తనదైన సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, ‘హరిహర వీరమల్లు’ చిత్రాలతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాలలో నటిస్తున్నాడు. ఇక ‘వకీల్ సాబ్’ చిత్రంతో కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటున్న పవన్ కొత్త కథల కన్నా రీమేక్ లే బెటర్ అన్నట్లు ఫిక్స్ అయిపోయాడు. ఈ క్రమంలోనే…
పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్’. మలయాళం సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు ఈ సినిమా రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం పవర్‌స్టార్ అభిమానులే కాదు రానా అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం హీరో రానా పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. Read Also: ఫ్యాన్స్ రచ్చపై స్పందించిన ఐకాన్ స్టార్.. ఎప్పుడూ మర్చిపోను..! రానా బర్త్‌డే కానుకగా…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ మూవీ నుంచి కీలక అప్‌డేట్‌ను చిత్ర బృందం మంగళవారం వెల్లడించింది. ఈ మూవీలోని ‘అడవి తల్లి మాట’ అంటూ సాగే ఈ పాటను బుధవారం ఉదయం 10:08 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇప్పటికే భీమ్లానాయక్ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లు, పాటలు సినిమాపై హైప్‌ను పెంచేశాయి. ఈ నేపథ్యంలో రేపు విడుదలయ్యే అడవి తల్లి పాటపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. Read…
టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో అమ్మడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు.. హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారు మతులు పోగొట్టడం ఎలానో నిధికి తెలిసినట్లు ఇంకెవరికి తెలియదు. ఇక ప్రస్తుతం నిధి, పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నిధి ఇటీవల పాల్గొంది. ఇక తాజాగా అమ్మడి కొత్త…
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు కానుకగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి టైటిట్ సాంగ్‌ను నటుడు రానా దగ్గుబాటి చేతుల మీదుగా ఆదివారం ఉదయం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటకు సాహిత్యం త్రివిక్రమ్ అందించగా… అరుణ్ కౌండిన్య ఆలపించాడు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించాడు. సాగర్.కె.చంద్ర దర్శకత్వం అందిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మలయాళం మూవీ ‘అయ్యప్పన్ కోషియుమ్’…
నటుడు పోసాని ఇంటిపై దాడి చేసిన కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. నటుడు పోసాని ఇంటితోపాటు పక్కన ఉన్న సిసి కెమెరాలు పనిచేయడం లేదని పోలీసుల విచారణలో బయట పడింది. దాడి చేసిన వాళ్లని పట్టుకోవాలంటే సిసి కెమెరా ఫుటేజ్ తప్పనిసరైంది. అయితే పోలీసులు చెక్ చేయగా అతని ఇంటి చుట్టు పక్కల ఎక్కడ కూడా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని బయటపడింది. దీంతో పోలీసులు ఆ ఏరియా మొత్తంలో పనిచేస్తున్న సీసీ కెమెరాలు పైన…
జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైసీపీ టార్గెట్ గా పవన్ కళ్యాణ్ మరోసారి రెచ్చిపోయి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. ‘మనవాడు.. మనవాడు అని చాలా మంది వైసీపీ మద్దతుదారులు అంటున్నారు. కులం కాదు గుణం ప్రధానం. మనవాడంటూ మీరు తెచ్చిచ్చిన అధికారంతో రాష్ట్రం ఏమైందో చూడండి. రాష్ట్రం ఈ విధంగా కావడానికి వైసీపీ మద్దతుదారులకూ బాధ్యత ఉంది. వైసీపీ మద్దతుదారులు కూర్చొని ఆలోచించండి. ఇప్పటి వరకు…
జనసేన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భవిష్యత్తులో ప్రభుత్వం మారడం ఖాయం.. 151 సీట్లు వచ్చిన వైసీపీకి 15 సీట్లే రావచ్చునని పవన్ తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఢంకా బజాయించి గెలుస్తుంది. అప్పుడు పాండవుల సభ ఎలా ఉంటుందో చూపిస్తా.. వైసీపీ నేతలకు సవాల్ విసురుతున్నా. ఏం చేస్తారో చేసుకోండి. తాటతీసి మోకాళ్ల మీద నించోబెడతా.. ప్రతి ఒక్కటి గుర్తుంచుకుంటా.. కాకినాడలో మా ఆడపడుచు మీద చేయి…