పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం భీమ్లా నాయక్ చిత్రంతో బిజీగా ఉన్నాడు ఈ సినిమా తరువాత వరుస సినిమాలను లైన్లో పెట్టిన పవన్ మరోవైపు నిర్మాతగా కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సినిమాలను నిర్మాతగా మారి రిలీజ్ చేశాడు.. ఒకటి సర్దార్ గబ్బర్ సింగ్ కాగా , రెండోది నితిన్ నటించిన చల్ మోహన్ రంగ చిత్రాలను నిర్మించారు. అయితే ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై చేయాల్సిన సినిమాలు ఇవి కాదని బ్యానర్ వ్యాల్యూకి తగ్గ కథల్ని ఎంచుకోవాలని అభిమానులు కోరారు. ఇక ఆ సినిమా తరువాత నిర్మాణం వైపు వేళ్ళని పవన్ ప్రస్తుతం మరో సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తునట్లు తెలుస్తోంది. కొత్త డైరెక్టర్ తో ఒక సున్నితమైన కథను ఎంచుకొని నిర్మిస్తున్నారట . అయితే ఏ సినిమాకు పవన్ కేవలం ప్రెజెంటర్ గా మాత్రమే వ్యవహరిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. మరి నిర్మాతగా రెండుసార్లు ఓడిపోయిన పవన్ ఈ మూడో చిత్రంతోనైనా విజయం అందుకుంటాడా ..? లేదా అనేది తెలియాల్సి ఉంది.