పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంని త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కానుంది అని మేకర్స్ ప్రకటించారు. అయిదు మధ్యలో ఈ సినిమా వాయిదా పడుతోందని ఎన్నో పుకార్లు వచ్చినా వాటన్నింటికి నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెక్ పెడుతూ.. ఎట్టి పరిస్థితిలోను జనవరి 12 న భీమ్లా నాయక్ రిలీజ్ అవుతుందని చెప్పుకొచ్చారు. దీంతో అభిమానులందరూ దాన్నే ఫిక్స్ అయిపోయారు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరోసారి భీమ్లా నాయక్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. సంక్రాంతి నుంచి తప్పుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25 కి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ విషయమై మేకర్స్ రేపు అధికారికంగా ప్రకటించనున్నారట. పవన్ ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూస్ అనే చేస్ప్పాలి. సంక్రాంతి రేసులో భీమ్లా నాయక్ ఉంటుందని, ఈసారి కూడా పవన్ హిట్ కొడతాడని కాచుకు కూర్చున్న ఫ్యాన్స్ కి గట్టి దెబ్బ తగిలిందనే చెప్పాలి. మరి రేపు మేకర్స్ ఏ రీజన్ చెప్పి ఈ సినిమాను వాయిదా వేస్తారో చూడాలి.