పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు, మరోపక్క రాజకీయాలతో బిజీగా మారిపోయాడు.. వరుస సినిమాలను ఒప్పుకొంటూనే రాజకీయాలలోని తనదైన సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, ‘హరిహర వీరమల్లు’ చిత్రాలతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాలలో నటిస్తున్నాడు. ఇక ‘వకీల్ సాబ్’ చిత్రంతో కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటున్న పవన్ కొత్త కథల కన్నా రీమేక్ లే బెటర్ అన్నట్లు ఫిక్స్ అయిపోయాడు. ఈ క్రమంలోనే వేరే భాషల్లో హిట్ ని అందుకున్న సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ అలాంటివే అన్న విషయం తెల్సిందే.
ఇక తాజాగా అందుతున్న సమాచారం బట్టి మరో రీమేక్ పై పవన్ కన్ను పడినట్లు తెలుస్తోంది. సీనియర్ నటుడు సముద్రఖని నటించి, దర్శకత్వం వహించిన ‘వినోదయ సీతమ్’ అనే తమిళ్ సినిమాను రీమేక్ చేయనున్నాడు పవన్.. ఇటీవల జీ5 ఓటిటీ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులందరిని ఆకట్టుకొంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని పవన్ రీమేక్ చేయనున్నాడట.. ఈ రీమేక్ కి సముద్ర ఖనినే దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ వెలువడాల్సి ఉంది. మరి రీమేక్ లతో వరుస హిట్లను అందుకున్న పవన్ ఈ రీమేక్ తో కూడా హిట్ ని అందుకుంటాడేమో చూడాలి.