పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ మూవీ నుంచి కీలక అప్‌డేట్‌ను చిత్ర బృందం మంగళవారం వెల్లడించింది. ఈ మూవీలోని ‘అడవి తల్లి మాట’ అంటూ సాగే ఈ పాటను బుధవారం ఉదయం 10:08 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇప్పటికే భీమ్లానాయక్ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లు, పాటలు సినిమాపై హైప్‌ను పెంచేశాయి. ఈ నేపథ్యంలో రేపు విడుదలయ్యే అడవి తల్లి పాటపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
Read Also: మరోసారి ప్రభాస్- అనుష్క రొమాన్స్..?
మలయాళం మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ‘భీమ్లానాయక్’ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు.
It's time to take in the #EssenceOfBheemlaNayak – అడవి తల్లి మాట ❤️#AdaviThalliMaata, 4th single from #BheemlaNayak Out tomorrow at 10:08am🎵@pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MusicThaman @MenenNithya @iamsamyuktha_ @ramjowrites @dop007 @adityamusic pic.twitter.com/VlF3a2n0YL
— Sithara Entertainments (@SitharaEnts) November 30, 2021