మంత్రి అనిల్ కి బండ్ల మార్క్ పంచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ కి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెల్సిందే. ఏపీలో సినిమా టికెట్స్ రేట్లు తగ్గించినందుకు టాలీవుడ్ హీరో నాని తన గొంతును విప్పి మాట్లాడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో టికెట్స్ రేట్లను తగ్గించి ప్రేక్షకులను అవమానిస్తున్నారు. థియేటర్ల కలెక్షన్ల కన్నా కిరాణా షాపు కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయని నాని అన్న మాటలకు వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.
తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఈ విషయమై స్పందించారు. ” నాకు నాని ఎవరో తెలియదు.. నాకు తెలిసిందల్లా కొడాలి నాని అన్న ఒక్కరే.. టికెట్ల రేట్ల మీద అంత బాధ ఉన్నహీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవచ్చు కదా.. ప్రజలను ఉద్దరిస్తానన్న పవన్.. తక్కువ రేట్ కు వినోదం పంచొచ్చు కదా.. గతంలో నేను కూడా నా బైక్ అమ్మి పవన్ కళ్యాణ్ సినిమాలకు కటౌట్ లు కట్టి డబ్బులు పోగొట్టుకున్నా.. ఇప్పుడు పవన్ అభిమానుల పరిస్థితి అలాగే ఉందని ” చెప్పుకొచ్చారు. ఇక ఈ వ్యాఖ్యలపై బండ్ల గణేష్ తనదైన మార్క్ పంచ్ వేస్తూ ట్వీట్ చేశాడు. “అందుకే రాష్ట్రానికి మంత్రి అయ్యావ్ అన్నా” అంటూ ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ అభిమానివి కాబట్టే ఇక్కడి వరకు వచ్చావ్ అనే అర్థంలో బండ్ల వేసిన కౌంటర్ కి పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
అందుకే రాష్ట్రానికి మంత్రి అయ్యావ్ అన్నా #AnilkumarYadav 🙏 https://t.co/wIOZoEKQ6d
— BANDLA GANESH. (@ganeshbandla) December 24, 2021
తాజావార్తలు
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి