యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే పాన్-ఇండియా రొమాంటిక్ డ్రామా “రాధే శ్యామ్”. ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కోసం అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రభాస్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి ఈ సినిమా టీజర్ అక్టోబర్ 23 న తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. “విక్రమాదిత్య ఎవరు? అక్టోబర్ 23 న ‘రాధేశ్యామ్’ టీజర్ లో తెలుసుకోవడానికి వేచి ఉండండి! టీజర్‌ను ఇంగ్లీష్ తో పాటు బహు…
అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్‌కు హిట్ రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యాఖ్యానించాడు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా సక్సెస్ మీట్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. కరోనా కారణంగా ప్రజలు థియేటర్లకు రావాలంటే భయపడుతున్న సమయంలోనూ నాగచైతన్య, అఖిల్ అన్నదమ్ములు ఇద్దరూ హిట్ కొట్టారని బన్నీ అభినందించాడు. అక్కినేని అభిమానులకు ఇది గర్వకారణమన్నాడు. అఖిల్ ‘మనం’ సినిమాలో ఆయన తాతయ్య ఏఎన్ఆర్తో నటించడం…
టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా మారిపోయింది పూజా హెగ్డే. వరుస హిట్లను అందుకొని స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అమ్మడు బాలీవుడ్ వైపు చూస్తోంది అన్న టాక్ వినిపిస్తోంది. అందుకోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి మొహంజదారో లాంటి సినిమాలో కలిసి నటించినా అమ్మడికి మాత్రం హిట్ దక్కలేదు. దీంతో ఎలాగైనా బాలీవుడ్ లో కూడా తన సక్సెస్ ని చూపించాలని తహతహలాడుతోంది. ఈ…
అఖిల్ అక్కినేని, డస్కీ బ్యూటీ పూజా హెగ్డే కలిసి నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకు సినీ ప్రియులు, అభిమానులతో పాటు విమర్శకుల నుండి కూడా సానుకూల స్పందన లభించింది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు రాబడుతోంది. కోవిడ్ -19 సెకండ్ వేవ్ తర్వాత “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” తెలుగులో భారీ ఓపెనింగ్స్ రాబట్టిన రెండవ చిత్రంగా నిలిచింది. తాజా నివేదిక ప్రకారం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”…
దసరా కానుకగా విడుదలైన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” మంచి వసూళ్లు రాబడుతున్నాడు. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అక్టోబర్ 15 న గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, సినిమా ప్రియుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో జయప్రకాష్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, ఈషా రెబ్బా, ఫరియా అబ్దుల్లా ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తాజా సమాచారం ప్రకారం…
ఎట్టకేలకు ప్రభాస్ అభిమానుల నిరీక్షణ ముగియబోతోంది. “రాధే శ్యామ్” టీజర్ కోసం చాలా కాలంగా ఆరాటపడుతున్న రెబల్ స్టార్ అభిమానుల ఆశ నెరవేరే సమయం ఆసన్నమైంది. ఈ పాన్ ఇండియా లవ్ స్టోరీలో హీరోయిన్ గా నటిస్తున్న పూజాహెగ్డే పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 13న ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో ప్రేరణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ పూజాహెగ్డే ఏంజిల్ లా మెరిసిపోతున్న లుక్ విడుదల చేశారు. తాజాగా టీజర్ ను కూడా విడుదల…
ఇవాళ అందాల భామ పూజా హెగ్డే పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న పలు చిత్రాల్లోని లుక్స్ ను పోస్టర్స్ ద్వారా విడుదల చేస్తూ, దర్శక నిర్మాతలు పూజా హెగ్డేకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రంలోనూ పూజా హెగ్డే నటిస్తోంది. అయితే… అందులో ఆమె కీలక పాత్రధారి రామ్ చరణ్ కు జోడీ కడుతోంది. అందుకే… పూజాహెగ్డే పోషిస్తున్న ‘నీలాంబరి’ లుక్ ను ఆమె పుట్టిన రోజు…
బుట్ట బొమ్మ పూజా హెగ్డే పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పూజ హెగ్డేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేపథ్యంలో ఆమె నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ మూవీ “రాధేశ్యామ్” టీం పూజాహెగ్డేకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది. అందులో పూజా హెగ్డే వైట్ డ్రెస్ లో ఏంజెల్ లా ఉంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే పాత్ర పేరు…
కన్నెలను కన్నెత్తి చూడని ఋష్యశృంగులనైనా వీపున బాజా మోగించి, తనవైపు చూపు తిప్పేలా చేసే కాకినాడ ఖాజాలాంటి అమ్మాయి పూజా హెగ్డే. ముంబైలో పుట్టిన పూజా హెగ్డే దక్షిణాది మూలాలు ఉన్నదే! ఉత్తర దక్షిణాలను తన అందంతో కలగాపులగం చేస్తోన్న ఈ భామ నేడు టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా రాజ్యమేలుతోంది. టాలీవుడ్ లో టాపు లేపుతూ సాగుతోంది పూజా హెగ్డే. పూజా హెగ్డే 1990 అక్టోబర్ 13న ముంబైలో జన్మించింది. ఆమె కన్నవారు కర్ణాటకలోని ఉడుపికి…
అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి చివరి సాంగ్ “చిట్టి అడుగా” అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సోల్ ఫుల్ గా సాగిన ఈ సాంగ్ కు సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం అద్భుతంగా ఉంది. సింగర్ జియా ఉయ్ హఖ్ పాడిన ఈ సాంగ్ సినిమాపై ఆసక్తిని…