యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన ‘రాధే శ్యామ్’పై అంచనాలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అంత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో “రాధేశ్యామ్” కూడా ఒకటి. ఇప్పటికే సినిమాపై భారీ హైప్ ఉండగా, సినిమాలో హీరో ‘విక్రమాదిత్య’ పాత్రను హైలైట్ చేస్తూ ప్రభాస్ పరిచయ టీజర్ ను చిత్రబృందం విడుదల చేయగా, ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇక ఇప్పటికే సినిమా టాకీ పార్ట్‌ను పూర్తి అయ్యింది. దీంతో ‘రాధే శ్యామ్’ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్న మేకర్స్. తాజాగా ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను భారీ ధరకు సొంతం చేసుకుంది ఆర్డి ఇల్యూమినేషన్. అయితే ఎంత ధరకు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముడు అయ్యాయన్న విషయం తెలియదు. కానీ కరోనా తరువాత మాత్రం అత్యంత భారీ ధరకు అమ్ముడైన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మాత్రం “రాధేశ్యామ్”వే కావడం విశేషం.
Read Also : ఒకేసారి నాలుగు చిత్రాలలో నిఖిల్!
మరోవైపు మరో టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ‘రాధే శ్యామ్’ మేకర్స్ నుండి రెండవ టీజర్ గా హీరోయిన్ కు సంబంధించిన వీడియో రాబోతోంది. దీపావళి పండుగ రోజున ఈ ప్రత్యేక టీజర్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ లలో పూజా హెగ్డే లుక్స్ పై మంచి హైప్ ఏర్పడింది. థ్రిల్లర్ అంశాలతో కూడిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ జ్యోతిష్యుడిగా నటిస్తున్నాడు.కాగా రాధేశ్యామ్ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకు సిద్ధంగా ఉంది.