యంగ్ హీరో అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” గత శుక్రవారం విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.20.5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. విడుదలైన 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసింది. కొన్ని సంవత్సరాల నుంచి హిట్ కోసం పరితపిస్తున్న అఖిల్ కెరీర్ లో “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” మంచి టర్నింగ్ పాయింట్ గా మారింది. ఇక పూజా హెగ్డే నటనకు అంతా ఫిదా అయిపోయారు. తాజా అప్‌డేట్ ప్రకారం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” మరో మైలురాయిని దాటాడు. ఈ చిత్రం యూఎస్ లో 5 వ రోజు $28,694 వసూలు చేసింది. ఐదు రోజుల్లో మొత్తం $ 500,006 (రూ.3.74 కోట్లు) రాబట్టింది.
Read Also : భారీ ధరకు “శ్యామ్ సింగ రాయ్” మ్యూజిక్ రైట్స్
కరోనా పరిస్థితుల నేపథ్యంలో “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” హాఫ్ మిలియన్ క్లబ్‌లోకి ప్రవేశించడం సరికొత్త ఫీట్ అని చెప్పొచ్చు. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. అఖిల్, పూజల మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ, ప్రత్యేకమైన కథాంశంతో బొమ్మరిల్లు భాస్కర్ తాజా ప్రేమ కథను ప్రేక్షకులకు అందించాడు. గోపి సుందర్ సంగీతం కూడా ఆకట్టుకుంది. ఈ దసరాకు విడుదలైన సినిమాలలో “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” హిట్ సాధించాడన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొత్తానికి ఈ దసరా సీజన్ అక్కినేని అభిమానులకు మరిచిపోలేని ట్రీట్ ఇచ్చింది.