మాది ఓవర్ కాన్షిడెన్స్ కాదు… నమ్మకం – ‘వరుడు కావలెను’ సంగీత్ వేడుకలో నాగశౌర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం ‘వరుడు కావలెను’. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం 29న థియేటర్‌లలో విడుదల కానుంది. ఇటీవల ట్రైలర్ ను విడుదల చేసిన యూనిట్, శనివారం సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా పూజాహెగ్డే హాజరవటం విశేషం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధా కృష్ణ (చినబాబు), నాగశౌర్య, రీతు వర్మ, దర్శకురాలు లక్ష్మీ సౌజన్య, నిర్మాత
సూర్యదేవర నాగ వంశీ, సప్తగిరి, మాటల రచయిత గణేష్ రావూరి, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్, గేయ రచయిత రాంబాబు గోశాల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలో పూజాహెగ్డే మాట్లాడుతూ ‘హీరోయిన్‌ని అతిథిగా ఆహ్వానించడం అరుదు. నన్ను అలా ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఆ క్రెడిట్ చిన్నబాబు, వంశీలదే. హారికా అండ్ హాసిని నా కుటుంబ సంస్థ. దర్శకత్వ శాఖలో మహిళలు చాలా తక్కువ. ‘వరుడు కావలెను’ మహిళా దర్శకురాలు తెరకెక్కించిన చక్కని ప్రేమకథ. అందరూ సినిమా చూసి మీ బాధల్ని మరచిపోండి. దర్శకురాలిగా సౌజన్యకు మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అని అన్నారు. నాగశౌర్య మాట్లాడుతూ ‘2018లో ఈ కథ విని ఓకే చేశా. 2019లో షూటింగ్ మొదలుపెట్టాం. ఈ జర్నీలో రెండుసార్లు కరోనా బ్రేక్ వేసింది. కష్టపడి సినిమా పూర్తి చేసి విడుదల వరకూ వచ్చాం. సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. ‘మన కుటుంబం మంచిది’ అని ఎంత గర్వంగా చెప్పుకుంటామో… మా సినిమా బాగా వచ్చిందని అంతే గర్వంగా చెప్పుకొంటాం. ఇది ఓవర్ కాన్షిడెన్స్ కాదు. సినిమా పట్ల ఉన్న నమ్మకం. బాగా వచ్చిందని తెలిసి ఎన్నో ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. అయినా నిర్మాతలు థియేటర్ రిలీజ్ కోసమే వేచి చూశారు. ఈ సినిమా హిట్‌తో
సౌజన్య కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతంతోనే సక్సెస్ అందుకున్నాం. భూమి పాత్రకు రీతూవర్మ పర్ఫెక్ట్‌గా సూట్ అయింది. తనతో మళ్లీమళ్లీ పని చేయాలనుంది. చినబాబుగారు, వంశీ కథను, సినిమాను ప్రేమించే నిర్మాతలు. ఇలాంటి వారు ఇండస్ట్రీకి చాలా అవసరం’ అని అన్నారు.
Read Also : తగ్గేదే లే… రికార్డ్స్ బద్దలు కొడుతున్న “రాధేశ్యామ్”
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రీతూవర్మ మాట్లాడుతూ ‘ప్రేమ, అనుబంథం ఇతివృత్తంగా పూర్తిగా కుటుంబ కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఈ కథ దొరకడం అదృష్టం. లక్ష్మీ సౌజన్య మంచి కథతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతంలో మంచి డాన్స్ నంబర్స్ కుదిరాయి. శౌర్య సపోర్ట్‌తో నా వర్క్ చాలా ఈజీ అయింది. మా ఈవెంట్‌కు పూజా రావడం చాలా ఆనందంగా ఉంది. మా అందరికీ సూపర్‌హిట్ సినిమా అవుతుంది’’ అని అన్నారు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘కథా బలం, కుటుంబ కథా చిత్రాల మీద మా సంస్థ దృష్టి పెడుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్, యువతను బాగా ఆకట్టుకునే చిత్రమిది’ అని అన్నారు. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ‘కథకు తగ్గ పాటలు, నేపథ్య సంగీతం కుదిరాయి. ఈ సినిమాలో భాగం అయినందుకు చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు. నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇందులో ఇతర ప్రధాన పాత్రధారులు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!