Plastic Waste: ప్రస్తుతం ఏ కోణంలో చూసినా అన్నింటా అగ్రదేశానికి అన్ని అర్హతలు భారతదేశానికి ఉన్నాయి. ఓ పక్క అభివృద్ధిలో దేశం దూసుకుపోతుంటే.. మరో పక్క చెత్త సమస్య దేశాన్ని పట్టిపీడిస్తుంది.
Air Quality : ఆసియా ఖండంలో వాయు కాలుష్యం అధికంగా ఉన్న టాప్ టెన్ నగరాల్లో ఎనిమిది ఇండియాలోనే ఉన్నాయని ప్రపంచ వాయు నాణ్యత సూచీ(వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) హెచ్చరించింది.
Pawan Kalyan: ఏపీలో ఇప్పటికిప్పుడు సడెన్‌గా ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధించడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. విశాఖలో పరిశ్రమల కాలుష్యం, విషవాయువు లికేజీ లాంటి అంశాల్లో మందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ ఘటనలకు బాధ్యులైనవారిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని, రిషికొండను ధ్వంసం చేసినా పట్టించుకోలేదని.. సడెన్‌గా పర్యావరణంపై ఇప్పుడు ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందని ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ నిలదీశారు. ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు…
పారిశ్రామికీకరణతో ఉద్యోగాలు వస్తాయని భావించినవారికి నిరాశే ఎదురైంది. కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలతో ఆరోగ్యాలు పాడవుతున్నాయని స్థానికులు ఆందోళనకు దిగారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న ఎస్ఎన్ఎస్ కంపెనీ వెదజల్లుతున్న వ్యర్ధాలతో వాయు కాలుష్యం నీటి కాలుష్యం వల్ల పోరాటాలు చేసి అలిసిపోయి బ్యూరోక్రాట్స్ ముందు నిరసన తెలుపుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం జింకలపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ఎస్ఎన్‌ఎస్ అనే పేరుతో ఏర్పాటు చేసిన కంపెనీ వ్యర్థాలతో దుర్వాసనతో చుట్టుపక్కల ఉన్న…
కాలుష్యం పెరిగి కొద్దీ అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం కాలుష్య సుడిగుండంలా మారుతోంది. పారిశ్రామిక అభివృద్ధి ఈ ప్రాంతానికి శాపంలా మారింది. రామగుండంలో భూగర్భం ఉపరితలం అంతా విషతుల్యంగా తయారైంది. ఏ విష వాయువు ఎప్పుడు వ్యాపిస్తుందో తెలియక తాగే నీరు కలుషితంతో అనారోగ్యాల బారిన పడుతూ జనం ఆందోళన చెందుతున్నారు. రామగుండం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. నియోజకవర్గ వ్యాప్తంగా జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఆర్ ఎఫ్ సి ఎల్, జెన్…
గుడి అన్నాక గంటలు మోగడం సహజం. హిందూ దేవాలయాల్లో గుడికి వచ్చిన భక్తులు గంట కొట్టి దణ్ణం పెట్టుకొని వెళ్తారు. అయితే, గుడిలో గంటల మోత అధికంగా ఉందని, గంటల కారణంగా శబ్దకాలుష్యం పెరిగిపోతున్నదని, గంటల శబ్దాన్ని పరిధిమేరకు అదుపులో ఉంచకపోతే శబ్దకాలుష్యచట్టం 2000, పర్యావరణ కాలుష్య చట్టం 1986 ప్రకారం కేసులు నమోదు చేస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించి పోలీసులు ఆలయ పూజారులకు, యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. బెంగళూరులో దొడ్డగణపతి ఆలయం…
గుడిసె..ఇప్పుడు పర్యాటకుల ప్రేమికులను తెగ ఆకట్టుకుంటున్న పర్యటక ప్రాంతం..! తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలంలో ఉన్న ఈగ్రామానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. అయితే విచ్చలవిడిగా రూల్స్ ఉల్లంఘించడంతో…. వచ్చే నెల 20 వరకు అనుమతిని నిలిపివేశారు. కాలుష్య నివారణ విషయంలో ఎలాంటి మినహాయింపులు వుండవంటున్నారు అధికారులు. తూర్పుగోదావరి జిల్లా మన్యంలోని మారేడుమిల్లిలో ఉన్న గుడిసె పర్యాటకుల సొంతం. పర్యాటకుల మదిని దోచే అందాలకొండ గుడిసె. దీని ప్రత్యేకతే వేరు. మారేడుమిల్లికే వన్నె తెచ్చిన వన దేవతకు కలికి తురాయిగా…
లక్షలాది ఎకరాలకు సాగునీరు, కోట్లమందికి తాగునీరు అందిస్తున్న మహానది గోదావరి కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ అవుతోందా? భద్రాచలం వద్ద గోదావరి కాలుష్య కాసారంగా తయారైందా? గోదావరిలో మునిగితే రోగాలు గ్యారంటీనా? అంటే అవుననే అంటున్నారు. గోదావరికి భారీగా మురుగు నీరు వచ్చి చేరుతోంది. గోదావరిలోకి కెమికల్ నీళ్లు వచ్చి చేరుతున్నాయ్. పంటలు సాగు చేయటానికి ఆ నీటినే వాడుతున్నారు. అలా పండిన పంటలను తిని జనం రోగాల పాలవుతున్నారు. కలుషిత నీటిని తాగి ఆస్పత్రుల్లో చేరుతున్నారు జనం.…
గవర్నమెంట్ ఆఫీసర్ అంటే వాళ్లకు ఎన్ని సదుపాయాలు ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే. అందులోనూ మంచి క్యాడర్ ఉన్న అధికారులకు కారులో వెళ్లే సౌకర్యాలు కూడా ఉంటాయి. అయితే తమిళనాడులో ఓ కలెక్టర్ మాత్రం చాలా సింప్లిసిటీతో ఉంటున్నారు. వారంలో ఒకరోజు ఇంటి దగ్గర నుంచి రెండు కిలోమీటర్లు నడిచి కార్యాలయానికి వెళ్తున్నారు. అయితే ఆమె నిర్ణయం వెనుక ఓ మంచి ఉద్దేశం ఉంది. వివరాల్లోకి వెళ్తే… తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన రమణ సరస్వతి కెమికల్…