పారిశ్రామికీకరణతో ఉద్యోగాలు వస్తాయని భావించినవారికి నిరాశే ఎదురైంది. కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలతో ఆరోగ్యాలు పాడవుతున్నాయని స్థానికులు ఆందోళనకు దిగారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న ఎస్ఎన్ఎస్ కంపెనీ వెదజల్లుతున్న వ్యర్ధాలతో వాయు కాలుష్యం నీటి కాలుష్యం వల్ల పోరాటాలు చేసి అలిసిపోయి బ్యూరోక్రాట్స్ ముందు నిరసన తెలుపుతున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం జింకలపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ఎస్ఎన్‌ఎస్ అనే పేరుతో ఏర్పాటు చేసిన కంపెనీ వ్యర్థాలతో దుర్వాసనతో చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాల ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు పెద్దలు శ్వాస సంబంధిత వ్యాధితో దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు.
ఈ ఫ్యాక్టరీ నుంచి బయటికి పంపే వ్యర్ధాలను ఫ్యాక్టరీ యాజమాన్యం పక్కనున్న పంటపొలాలను లీజుకు తీసుకుని అక్కడే డంప్ చేస్తోంది. ఫ్యాక్టరీ నుంచి వెలువడే రసాయనాలను పంట పొలంలో వదులు తుండడంతో చుట్టుపక్కల ఉన్న పొలాలలో భూగర్భ జలం కలుషితమై బావులలో బోర్లలో కలుషిత నీరు చేరుతోది. ఆనీటిని పంటలకు ఉపయోగించడం వలన పంటలకు వైరస్ సోకడంతో రైతులకు దిగుబడి రాక అప్పులపాలై పోతున్నామని ఆవేదన చెందుతున్నారు. దీనిపై కాలుష్య మండలి స్పందించక పోతుందా అని గత 15 సంవత్సరాలుగా ఎన్ని పోరాటాలు చేసినా యాజమాన్యం దౌర్జన్యం ముందు నిలబడలేక పోతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. మా బాధలను ఎవరూ పట్టించుకోకపోవడంతో భవిష్యత్తులో రాజకీయపరంగా సామాజిక పరంగా తమ పరిస్థితి ఏంటని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బట్టతలకు మందు వచ్చిందోచ్.. ఇక మీ జుట్టు మీ సొంతం