Hot Topic Fog: దేశంలో ఇప్పుడు ఏం నడుస్తోందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు నలుగురు కలిస్తే ఏం నడుస్తోంది? అనేవారు. అప్పుడంతా జనం FOG నడుస్తోంది అనేవారు. అప్పుడదే పెద్ద హాట్ టాపిక్ అయ్యేది. తాజాగా దేశమంతా కూడా FOG నడుస్తోంది. నిజంగానే పొగమంచు (FOG) కమ్ముకుంటోంది. దీంతో ఎవరిని అడిగినా ఫాగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. Fragrance కోసం యూత్ ఎక్కువగా ఫాగ్ వాడేవారు. ఇప్పుడు అసలే చలికాలం.. ఒకవైపు వణికించే చలి.. మరోవైపు కమ్ముకున్న పొగమంచు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పొగమంచు కప్పేసింది. గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్ తదితర వాయువులతో పాటు నీటి ఆవిరి కూడా ఎక్కువగా ఉంటుంది. దీనినే తేమ లేదా ఆర్ద్రత అంటాం. ఈ తేమ ఎంత ఉంటుందన్న విషయం గాలి పీడనం, ఉష్ణోగ్రతలను బట్టి ఆధారపడి వుంటుంది. గాలి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే తేమశాతం ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే తేమ శాతం తక్కువగా ఉంటుంది. రహదారుల నిండా పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
Parliament Winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారు..
Also Read
- తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
- Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
తెల్లవారుజామున దట్టమైన పొగ మంచు కమ్మేసింది. పొగమంచు నిండుకోవడంతో ప్రధాన రహదారుల వెంబడి వెళ్తున్న వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు గ్రామాల్లో ఒక మోస్తరు మంచు ఏర్పడినా పంట పొలాల్లో ఉన్న ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడింది. ఏపీలోని అరకు, తెలంగాణలోని ఆదిలాబాద్, మెదక్ ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. ఉదయం విధులకు హాజరయ్యే వారు, రోజువారీ కూలీలు ఇబ్బంది పడుతున్నారు. పొగమంచుగా పరిగణించాలంటే, తేమ స్థాయి 70శాతం కంటే ఎక్కువ లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అయితే శీతాకాలంలో తేమ తక్కువగా వున్నా పొగ కమ్ముకుంటుంది. శీతాకాలంలో ఏర్పడే పొగమంచు కారణంగా, హైవేపై వాహనాల వేగం తగ్గుతుంది. అలాగే రైళ్లు, విమానాలకు కూడా దారి తెలీదు. దీంతో అవి ఆలస్యంగా నడుస్తుంటాయి. ఒక్కోసారి పొగమంచు వల్ల విమానాలు రద్దవుతుంటాయి.

పొగమంచు అనేది ఢిల్లీలో ఎక్కువగా ఉంటుంది. అసలే కాలుష్యం దీనికి తోడు పొగమంచు ప్రభావం వల్ల చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ పొగమంచు ఉదయం చాలా ఎక్కువగా ఉంటుంది. భూమిపై రాత్రిళ్ళు వేడి వుంటుంది. గాలిలోని నీటి ఆవిరి చల్లబడి, ఘనీభవించి చిన్న నీటి బిందువులు ఏర్పడతాయి. అవి భూమి ఉపరితలంపై ఉన్న దుమ్ము, ధూళివంటి అతి చిన్న కణాలను ఆవరించే గాలిలో తేలియాడడం వల్ల పొగమంచు ఏర్పడుతుంది. భూమికి దగ్గరగా ఒక తెరలాగా ఏర్పడటంతో పొగమంచు అవతలివైపు వస్తువులను మనం సరిగా చూడలేము. రహదారులు పొరలాగా కనిపిస్తాయి. అవతలి వ్యక్తి లేదా వాహనాలు సరిగా కనిపించవు. దీంతో ప్రమాదాలకు ఆస్కారం వుంటుంది. విమానాలకు ఈ ప్రభావం ఎక్కువగా వుంటుంది. ఆకాశంలో వెళ్లే ఇతర విమానాలు వాటికి కనిపించవు. బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో పొగమంచు ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. పొగమంచు వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా చోటుచేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు వైద్యనిపుణులు.

ఏం నడుస్తోంది? FOG Uncle
తాజావార్తలు
-
Used Oil: హైదరాబాద్ హోటల్స్‌లో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడేస్తున్నారు.. ఫ్రీజర్‌లో కుళ్లిపోయిన ఆహారం..
-
Tech Layoffs: ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగం పోయింది.. ‘‘సాఫ్ట్వేర్ కెరీర్ వదిలేయాలా?’’
-
Nani: “శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా”: నాని
-
AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
-
Srikanth Odela: “మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా”
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?