ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడ ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు. దాదాపు అన్ని దేశాలు తమ ఎంబసీలను ఖాళీ చేసి వెళ్లిపోయాయి. అంతర్జాతీయంగా తాలిబన్ ప్రభుత్వానికి గుర్తింపులేకపోవడంతో ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు. పైగా పలు ఉగ్రవాద సంస్థలు ఆఫ్ఘన్‌లో దాడులకు పాల్పడుతున్నాయి. ప్రజాస్వామిక ప్రభుత్వం లేకపోవడంతో అమెరికా నిధులను నిలిపివేసింది. అయితే, మానవతా దృక్పధంతో ఇండియా వంటి దేశాలు ప్రజలు శీతాకాలంలో ఇబ్బందులు పడకూడదని 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను, మందులను సరఫరా చేస్తున్నది. Read:…
యమునా నది విషపు నురుగుతో పోరాడుతుంది. యమునా నదిలో నడుము లోతు వరకు విషపూరితమైన నురుగుతో నిలబడిన భక్తుల షాకింగ్ చిత్రాలు, వీడియోలు ప్రతి సంవత్సరం ముఖ్యాంశాలుగా మారుతూ ఉంటాయి. ఈ సంవత్సరం కూడా దీనికి భిన్నంగా ఏం లేదు. సోమవారం, కలుషితమైన నదిలో మహిళలు కార్వా చౌత్ సంద ర్భంగా స్నానం చేస్తున్న అనేక క్లిప్‌లు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేశా యి. అయితే, ఈ ఏడాది విషపూరిత నురుగు సమస్యకు ఢిల్లీ జల్ బోర్డు…
గత కొన్ని రోజులుగా, ఢిల్లీలో ఉష్ణోగ్రత తగ్గింది, కానీ ఖచ్చితంగా మంచు కురిసేంత చలి లేదు! ఢిల్లీలోని యమునా నదిలో తేలియాడే మంచులా కనిపించే తెల్లటి పదార్థంతో యుమునా నది అంతా పూత పూసిట్టు ఉంది. కానీ ఇది మంచు కాదు. ఇది నీటి కాలుష్యం ఫలి తంగా నదిని కప్పి ఉంచిన విషపూరిత నురుగు. పరిశ్రమలు, కర్మాగా రాల నుండి విడుదలయ్యే కాలుష్యం నదిలో అమ్మోనియా స్థాయి 3 పార్ట్స్ ఫర్ మిలియన్‌కు పెరగడం వల్ల…
దేశరాజధాని ఢిల్లీకి నీటి కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే తీవ్ర వాయు కాలుష్యంతో సతమతమవుతుంటే ఇప్పుడు నీటి సరఫరా బంద్ కావ డంతో మరిన్ని కష్టాలు ఢిల్లీ వాసులును వెంటాడుతున్నాయి. ఇప్ప టికే పెరిగిన కాలుష్యంతో నగర ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతు న్నారు. దీంతో పాటు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. యమునా నది తీరంలో ప్రమాదకర స్థాయిలో కాలుష్యం పెరిగి పోవడంతో ఢిల్లీలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరా ఆగిపో యింది. ఈ నది నీటిలో…
అసలే కాలుష్యం.. ఆపై దీపావళి తోడైంది. దీంతో దేశ రాజధాని ప్రాంతం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఢిల్లీ లోని వాహనాలు, నిర్మాణాలు, రహదారులు, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంతో పాటు, పొరుగున ఉన్న హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాల్చివేత, బొగ్గు ఆధారిత విద్సుదుత్పత్తి కేంద్రాల నుంచి వెలువడే కాలుష్యం ఇబ్బందుల పాలు చేస్తోంది. దీనికి తోడు దీపావళి పండుగ కాలుష్యం కూడా తోడవడంతో పరిస్థితి విషమించింది. ధూళి అణువులు 2.5 మైక్రాన్స్ పరిమాణంలో…
ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతుండటంతో రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. వాహనాలు రోడ్డుమీదకు వచ్చిన సమయంలో తప్పని సరిగా వాహనాలకు సంబంధించిన పొల్యూషన్ అండ్ కంట్రోల్ సర్టిఫికెట్ తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలని, వాహనాలను చెక్ చేసిన సమయంలో పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే ఆరునెలల పాటు జైలుశిక్ష లేదా రూ 10 వేల రూపాయల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని ఢిల్లీ రవాణా శాఖ తెలియజేసింది.…
ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా ఎప్పటి నుంచో కన్నేసింది. ఎలాగైనా ఆ రాష్ట్రాన్ని తన దేశంలో కలిపేసుకొవాలని చూస్తున్నది. లద్దాఖ్ లో కిరికిరి చేస్తూనే, చైనా అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్‌లో బలగాలను మొహరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అయితే, చైనా ఇప్పడు కొత్త ఎత్తులు వేస్తున్నది. చైనా నుంచి ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశంచే నదులను కలుషితం చేస్తున్నది. దీని వలన నదులు నల్లగా మారిపోతున్నాయి. అందులో నివశించే చేపలు, ఇతర జీవులకు ఆక్సీజన్ అందక వేల…
సముద్రాల్లో కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతున్నది. అరుదైన సముద్ర జంతువులు ఈ కాలుష్యానికి నశించిపోతున్నాయి. కాలుష్యంతో పాటుగా బీచుల్లో పడేసిన చెత్త సముద్ర జలాల్లోకి ప్రవేశించంతో జలచర జీవులు ఇబ్బందులు పడుతున్నాయి. బీచ్ అందాలకు చెత్త అవరోధంగా మారింది. ఎంత అవగాహన కలిగించినప్పటికీ మార్పు రాకపోవడంతో కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కువైట్ బీచుల్లో చెత్తను వేసిన వారిపై కఠిన చర్యలతు తీసుకునేందుకు సిద్ధమయింది. బీచుల్లో చెత్తను వేసినవారికి 10వేల కువైట్ దినార్లు జరిమానాగా విధిస్తామని ప్రభుత్వం…
కరోనా కారణంగా చాలా కాలంపాటు ఆంక్షలు కొనసాగడంతో కాలుష్యం చాలా వరకు తగ్గిపోయింది. కాగా, ఆంక్షలను చాలా వరకు ఎత్తివేశారు. రోడ్డుమీదకు వాహనాలు తిరిగి పరుగులు తీస్తున్నాయి. దీంతో వాయుకాలుష్యం తిరిగి మొదలైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 350 పాయింట్లు దాటడంతో పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. పంజాబ్, హర్యానా, యూపీ సరిహద్దుల్లో పంట వ్యర్థాల దహనంతో వాయుకాలుష్యం భారీగా పెరిగిపోతున్నది. పంట వ్యర్థాలను…