Ramagundam Pollution:కాలుష్య సుడిగుండం.. ప్రజలకు శాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాలుష్యం పెరిగి కొద్దీ అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం కాలుష్య సుడిగుండంలా మారుతోంది. పారిశ్రామిక అభివృద్ధి ఈ ప్రాంతానికి శాపంలా మారింది. రామగుండంలో భూగర్భం ఉపరితలం అంతా విషతుల్యంగా తయారైంది. ఏ విష వాయువు ఎప్పుడు వ్యాపిస్తుందో తెలియక తాగే నీరు కలుషితంతో అనారోగ్యాల బారిన పడుతూ జనం ఆందోళన చెందుతున్నారు. రామగుండం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. నియోజకవర్గ వ్యాప్తంగా జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఆర్ ఎఫ్ సి ఎల్, జెన్ కో సింగరేణిల కాలుష్యం బూడిద చెరువుల గుట్టలతో నింగి నేల నీరు జనాలను దెబ్బతిస్తున్నాయి.
ఆర్ ఎఫ్ సి ఎల్ నుండి ఆమోనియా వ్యర్ధాలు ఎలాంటి ట్రీట్ మెంట్ లేకుండా గోదావరిని కాలుష్య గరళంగా మారుస్తున్నాయి. మరోవైవు ఫ్యాక్టరీ నుండి వెలువడే ఆమోనియా విష వాయువు రామగుండం వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మరోవైపు ఎన్టీపీసీ లో బొగ్గు కాల్చగా వెలువడే యాష్ కందనపల్లి గ్రామంలోని యాష్ చెరువుకు తరలిస్తారు అక్కడ నుండి వందల లారీల్లో రవాణా నేపథ్యంలో అనేక గ్రామాలు బూడిద మయంగా మారుతున్నాయి. ఇటు సింగరేణి కాలనీల నుండి వెలువడే వ్యర్థ జలాలు జనగామ చెరువు వద్ద గోదావరిలో కలుస్తాయి. అదే గోదావరి నుండి సింగరేణి కాలనీ లకు,పట్టణానికి త్రాగు నీరుగా అందిస్తున్నారు. కోల్డ్ బెల్ట్ ఏరియాలో ఓపెన్ కాస్టుల్లో బాంబుల మోత దుమ్ము ధూళి అంతా కలిసి రామగుండం ఏరియా కాలుష్య కోరల్లో చిక్కుకుంది.
Also Read
- Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
- Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
ఇంకోవైపు ఈ ప్రాంతాలలో నివసించే మనుషులు జీవిత కాలం కనీసం పదేళ్లు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. శ్వాసకోశ వ్యాధులు, చర్మ ఎముకల జబ్బులు, గుండె సంబంధిత రోగాలు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వాలు, పరిశ్రమలు కాలుష్య నియంత్రణ మండలి పట్టించుకోకుండా ఉండటం వల్లనే జల వాయు శబ్ద కాలుష్య నియంత్రణ చేయలేని స్థితికి రామగుండం చేరిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. రామగుండం ప్రాంతంలో మానవ మునుగడప్రశ్నర్థకంగా మారిందని అంటున్నారు. రామగుండంలో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Hero’s As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
-
Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
-
Royal Enfield Classic 350 లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త కలర్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్‌లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
ట్రెండింగ్
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!