గుడిసెను కమ్మేస్తున్న కాలుష్యం… అందుకే నిషేధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుడిసె..ఇప్పుడు పర్యాటకుల ప్రేమికులను తెగ ఆకట్టుకుంటున్న పర్యటక ప్రాంతం..! తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలంలో ఉన్న ఈగ్రామానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. అయితే విచ్చలవిడిగా రూల్స్ ఉల్లంఘించడంతో…. వచ్చే నెల 20 వరకు అనుమతిని నిలిపివేశారు. కాలుష్య నివారణ విషయంలో ఎలాంటి మినహాయింపులు వుండవంటున్నారు అధికారులు.
తూర్పుగోదావరి జిల్లా మన్యంలోని మారేడుమిల్లిలో ఉన్న గుడిసె పర్యాటకుల సొంతం. పర్యాటకుల మదిని దోచే అందాలకొండ గుడిసె. దీని ప్రత్యేకతే వేరు. మారేడుమిల్లికే వన్నె తెచ్చిన వన దేవతకు కలికి తురాయిగా పేరొందిన ప్రాంతం ఇది. నిత్యం వేలాదిమంది వాహనాల్లో ఇక్కడికి తరలివస్తుండడంతో సందడిగా మారుతోంది. మారేడుమిల్లి పరిసరాల్లోని జలపాతాలు, పర్యాటక ప్రదేశాలను అటవీశాఖ ఆధ్వర్యంలో సీబీఈటీల ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. పుల్లంగి పంచాయతీలోని ఈ కొండ తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశ వ్యాప్తంగా ఖ్యాతి చెందింది.
Also Read
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...

అయితే ఇప్పుడు ఈపర్యాటక ప్రాంతానికి తాకిడి పెరడగంతో పర్యారణ ముప్పు ఏర్పడింది. ఇక్కడకు వచ్చే పర్యాటకులు చెత్త, చెదారాలను విచ్చలవిడిగా పడేస్తున్నారు. రాత్రులు మంటలు వేసుకోవడం, మద్యం సేవించిన బాటిల్స్ పగులకొట్టి పాడేయడం లాంటివి చేస్తున్నారు. దీంతో అందాల కొండ గుడిసెకు పర్యావరణ ముప్పు వాటిల్లుతుందనే ఉద్దేశంతో పర్యాటకులను మార్చి 20వ తేదీ వరకు నిలుపుదల చేశారు. గుడిసె పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకే ఈ చర్యలు చేపట్టారు.
గుడిసె అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అందుకే రంపచోడవరం ఐటీడీఏ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. పీవో ప్రవీణ్ ఆదిత్య ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కొండ కిందనున్న గుండ్రతి వద్ద కాటేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రహదారి నిర్మించేందుకు గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ఆద్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. గ్రామ పంచాయతీ, అటవీ, ఐటీడీఏ, రెవెన్యూ శాఖల సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి మార్చి 20వ తేదీ నుండి తిరిగి పర్యాటకులకు అనుమతి ఇవ్వనున్నారు.
తాజావార్తలు
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్‌లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!