తెలంగాణ మహిళా కాంగ్రెస్‌లో గొడవలు చినికి చినికి గాలి వానాలా మారిపోయాయి. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తీరే వివాదాలకు కారణమన్నది కొందరి వాదన. ప్రశ్నించినా.. చెప్పిన పని చేయకపోయినా వారిని వెంటనే పార్టీ నుంచి బయటకు పంపేస్తున్నారట. ఇటీవల మహిళా కాంగ్రెస్ సమావేశం జరిగితే… ఓ రేంజ్‌లో రసాభాస అయ్యింది. దుర్భాషలాడారనే అభియోగాలతో మహిళా కాంగ్రెస్ సిటీ అధ్యక్షురాలు పదవి నుంచి కవితామహేష్‌ను తప్పించారు. ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయన్నది గాంధీభవన్ వర్గాల టాక్. మహిళా…
ఎన్నికల షెడ్యులు విడుదల కావడంతో ప్రజలు, పార్టీల దృష్టి కాబోయే రాష్ట్రపతి అభ్యర్థిపై పడింది. ఈ ఎన్నికల ద్వారా జాతీయస్థాయిలో రాజకీయ పరిణామాలు ఏలా మారతాయి? ఏ కూటమి నుంచి ఎవరు అభ్యర్ధిగా బరిలో దిగుతారో అనేదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి తమ అభ్యర్ధి గెలుపు కోసం లెక్కలతో కుస్తీ పడుతోంది. పలు పార్టీలతో మంతనాలు జరుపుతున్నారు బీజేపీ ముఖ్యనేతలు. అయితే NDAకు వ్యతిరేకంగా రాష్ట్రపతి అభ్యర్ధిగా బరిలో ఎవరు ఉంటారు?…
*ఇవాళ తిరుమలలో కరెంట్ బుకింగ్ విధానంలో జ్యేష్ఠాభిషేకం టిక్కెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ. *నేడు గుంటూరు , తెనాలి ప్రాంతాల్లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రవీణ్ పవార్ పర్యటన *నేడు శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవం. పాల్గొననున్న టీటీడీ ఛైర్మన్ &స్విమ్స్ ఛాన్సలర్ వైవీ సుబ్బారెడ్డి,ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డా. సౌమ్య స్వామినాథన్. *విశాఖ నగరానికి రానున్న కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి…
ప్రస్తుత రాష్ట్రపతిపదవీ కాలం ఈ ఏడాది జులై 24తో ముగియనుండటంతో దేశానికి కాబోయే కొత్త రాష్ట్రపతి ఎవరనే చర్చ కొంతకాలంగా నడుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలు ఎలా జరుగుతాయి? ఎమ్మెల్యేలు, ఎంపీల ఓటు విలువ ఎలా డిసైడ్ అవుతుంది? తెలుగు రాష్ట్రాలకున్న ఓట్లెన్ని? అసలు ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏ, యూపీఏ పక్షాల బలమెంత? దేశ 15వ రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ ఖరారైంది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ నిర్వహించనున్నారు. జులై 21న కౌంటింగ్ చేపట్టనున్నారు. ఈ నెల…
AICC ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన జాతీయస్థాయి చింతన్ శిబిర్ తర్వాత.. తెలంగాణలోనూ కాంగ్రెస్ చింతన్ శిబిర్ సమావేశాలను ఘనంగా ముగించారు రాష్ట్ర పార్టీ నాయకులు. కాకపోతే ఈ చింతన్ శిబిర్‌తో పార్టీ ఏం చెప్పాలని అనుకుంది? ఏం చెప్పింది అనేది పార్టీ కేడర్‌కు కూడా అంతుచిక్కడం లేదట. ఆ సమావేశాల్లో కాంగ్రెస్ నాయకులంతా ఓపెన్ అయ్యారు. వాటిలో పార్టీ తీసుకున్న నిర్ణయాలేంటన్నదే స్పష్టత కరువైనట్టు కేడర్ చెవులు కొరుక్కుంటోంది. అమలు చేయాల్సిన నిర్ణయాలేంటో కూడా శ్రేణులకు అర్ధం కాలేదని…
పీతల సుజాత.. కొత్తపల్లి జవహర్. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఈ ఇద్దరు టీడీపీ నేతలు గతంలో మంత్రులుగా పనిచేశారు. 2014లో చింతలపూడి నుంచి సుజాత, కొవ్వూరు నుంచి జవహర్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇద్దరూ స్థానికేతరులైనప్పటికీ.. అక్కడ టీడీపీకి బలం ఉండటంతో అసెంబ్లీలో ఆనాడు ఈజీగానే అడుగు పెట్టేశారు. గత ప్రభుత్వంలో ముందుగా సుజాత.. తర్వాత జవహర్ కేబినెట్ మంత్రులయ్యారు. గెలిచిన కొత్తలో బాగానే ఉన్నా.. మంత్రులయ్యాక నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు పెరిగిపోయాయి.…
ఆ మధ్య తెలంగాణ బీజేపీలో కొందరు సీనియర్లు.. పాతతరం నాయకుల తీరు కలకలం రేపింది. పార్టీ వ్యవహారాలపై గుర్రుగా ఉన్న వాళ్లంతా.. బీజేపీ నిర్ణయాలకు వ్యతిరేకంగా జట్టుకట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్న తరుణంలో ఈ పరిణామాలు కమలాన్ని కలవర పెట్టాయి. సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డిని రంగంలోకి దించి.. అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. దాంతో పాత నేతలు చల్లబడినట్టు సమాచారం. అయినప్పటికీ తమకు బీజేపీలో తగిన గౌరవం ఇవ్వడం లేదనే అభిప్రాయంలోనే…
తెలంగాణ శాసన మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, చీఫ్‌విప్ పోస్టులను ఒకేసారి భర్తీ చేస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ.. గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒక్కరినే మరోసారి ఛైర్మన్‌గా చేసి సరిపెట్టేశారు. డిప్యూటీ ఛైర్మన్, చీఫ్‌విప్ పదవుల ఉసే లేదు. శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ పోస్టు బీసీ సామాజికవర్గానికి దక్కుతుందని అప్పట్లో టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరిగింది. రేపో మాపో పేరు ప్రకటిస్తారని అనుకుంటూనే ఉన్నారు కానీ.. కొలిక్కి రావడం లేదు. దీంతో ఎందుకు భర్తీ…
కొట్టు సత్యనారాయణ. ఏపీ డిప్యూటీ సీఎం. దేవాదాయశాఖ మంత్రి. గత మూడేళ్ల కాలంలో ఎక్కువగా చర్చల్లో నలిగింది ఈ శాఖే. కొట్టుకు ఆ విషయం తెలియంది కాదు. కానీ.. మంత్రిగారు ఎటుపడితే అటు నాలిక మడత పెట్టేస్తున్నారని సొంత శాఖలోనే సణుగుడు ఎక్కువైంది. దీంతో దేవాదాయశాఖ వర్గాలు.. ప్రభుత్వ పెద్దల్లో చర్చగా మారిపోయారట కొట్టు సత్యనారాయణ. ఇటీవల మంత్రి కొట్టు సత్యనారాయణ కొన్ని కామెంట్స్ చేశారు. ఐదు లక్షల్లోపు ఆదాయం ఉన్న ఆలయాలను అర్చకులకు అప్పజెప్పాలని కోర్టు…