రాజమండ్రి వైసీపీలో ఇటీవల ఊహకందని చిత్రం పొలిటికల్ తెరపై కనిపించింది. ఉప్పు నిప్పుగా ఉన్న ఎంపీ మార్గాని భరత్.. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు దోస్త్ మేరా దోస్త్ అన్నట్టుగా కలిసిపోయారు. ఈ మూడేళ్ల కాలంలో ఇద్దరు యువ నేతలు అనేకసార్లు రచ్చకెక్కారు. పార్టీ అధిష్ఠానం సైతం సయోధ్యకు విఫలయత్నం చేసింది. భరత్, రాజాలు కలవడం అసాధ్యమని అనుకున్నారు. కానీ.. విభేదాలను పక్కన పెట్టేసినట్టు ఎంపీ, ఎమ్మెల్యేలు స్వయంగా ప్రకటించడంతో అంతా ఆశ్చర్యపోయారు. వైసీపీలో సంస్థాగతంగా చేపట్టిన…
సుబ్రహ్మణ్యం మృతి కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు హంతకుడని వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. రాష్ట్రమంతా ఈ వ్యవహారం గందరగోళంగా మారినా, ఎమ్మెల్సీ లైట్ తీసుకున్నారు. ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. చివరకు ఆయన మెడకే ఉచ్చు బిగుస్తోంది. అయితే, ఇప్పుడు దీని వెనక ఆసక్తికర చర్చ జరుగుతోందట. ఘటన జరిగినప్పుడు అనంతబాబు ద్వారంపూడిని కాంటాక్ట్ అయ్యారా?అనంత బాబు రెండు పదవులు రావడంలో ద్వారంపూడి కీ రోల్?సమస్య పరిష్కారమైందని అనంతబాబు ఊహించారా?ఎవరూ ఏమి చేయలేని స్థాయికి పరిస్థితులు…
జాతీయ రాజకీయాల్లో మరోసారి ప్రధానమంత్రి మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి హాట్ హాట్ గా చర్చ మొదలైంది. ప్రధాని రాక సమయంలోనే, కేసీఆర్ మరో స్టేట్ లో వుండటంపై పొలిటికల్ కాక రేగుతోంది. మే 26న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మోడీ పర్యటన సందర్భంగా హడావిడి చేసేందుకు తెలంగాణ బీజేపీ రెడీ అవుతోంది. మరోవైపు మోడీ హైదరాబాద్…
ఖమ్మం పార్లమెంటుకు గతంలో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అనుచరులను పెట్టుకున్నారు. అక్కడ రాజకీయాలను ప్రభావితం చేయాలని చూస్తారు ఈ మాజీ ఎంపీ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు.. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొంగులేటి పాత్రపై రకరకాలుగా ప్రచారం జరిగింది. క్రాస్ ఓటింగ్ వెనక పొంగులేటి ఉన్నట్టు సీఎం కేసీఆర్‌కు నివేదికలు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయనకు పార్టీ పదవులు..…
మాజీ సీఎం నల్లారి కిరణ్ కూమార్ రెడ్డి పొలిటికల్ సర్కిల్స్ హాట్ టాపిక్‌గా మారారు. వాయల్పాడు, పీలేరు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 2004-2014లోపల చీఫ్‌విప్, స్పీకర్, ఉమ్మడి ఏపీకి చిట్టచివరి సీఎంగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి దెబ్బతిన్నాక అప్పటి నుంచి సైలెంట్‌గా ఉన్నారు. అయితే 2019 ఎన్నికల ముందు బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరిగినా.. మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరారు. కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో నిర్వహించిన సభకు మాత్రమే…
బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఎలాగైనా రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురేయాలని చూస్తోంది. ఇందు కోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకొనే పనిలో పడింది. వివిధ సందర్భాల్లో తెలంగాణ బీజేపీ నేతలకు ప్రాధాన్యం ఇస్తుంది ఢిల్లీ నాయకత్వం. పార్టీ పదవుల్లో ఇప్పటికే పెద్దపీట వేసింది. మోడీ సర్కార్‌లో కిషన్‌రెడ్డికి కేబినెట్ పదవి ఇచ్చింది. బండారు దత్తాత్రేయను గవర్నర్‌ను చేసింది. ఇదే కోవలో మరికొన్ని పదవులు కట్టబెట్టేందుకు సిద్ధమైందన్న ప్రచారం కాషాయ శిబిరంలో…
గన్నవరం వైసీపీలో వేడి తగ్గటం లేదు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, నియోజకవర్గ మాజీ ఇంఛార్జ్ దుట్టా రామచంద్రరావు వర్గాల మధ్య సెగలు ఓ రేంజ్‌లో రాజుకున్నాయి. టీడీపీ టికెట్ పై గెలిచి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు వంశీ. గత ఎన్నికల వరకు పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ గా వ్యవహరించిన దుట్టా వర్గానికి వంశీ రాక ఇబ్బందిగా మారింది. 2014లో వంశీపై పోటీ చేసి దుట్టా 9 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కలేదు.…
తెలుగు రాష్ట్రాల నుండి రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు విజయసాయి రెడ్డి, ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి, బీదా మస్తాన్ రావులను వైసీపీ ఎంపిక చేసింది. ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న విజయసాయి రెడ్డి, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సురేశ్ ప్రభుల పదవీకాలం జూన్ 21తో ముగుస్తుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది. జూన్ 10వ తేదీన పోలింగ్ జరుగుతుంది. విజయసాయి రెడ్డి…
వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో పావులు కదుపుతోంది బీజేపీ. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాబోదనే నినాదంతో కేడర్‌లో చురుకుపుట్టించే ప్రయత్నం చేస్తున్నారు నాయకులు. పార్టీ అగ్రనేతల రాక కూడా కలిసి వస్తుందనే లెక్కల్లో ఉన్నారు. అయితే పైకి గంభీరంగా ఉన్నా బీజేపీ విస్తరణ.. సంస్థాగతంగా బలోపేతం అయ్యే విషయంలో నేతల మాటలకు.. గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పనులకు అస్సలు పొంతన కనిపించడం లేదట. ఇందుకు ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై తీసుకుంటున్న శ్రద్ధ ఏ పాటిదో.. అందులోని…