తెలంగాణ BJP అనుబంధ విభాగాలు ఉన్నాయి. ఈ అనుబంధ మోర్చా లన్నింటికి కమిటీలు కూడా ఉన్నాయి. యువజన మోర్చ, మహిళా, కిసాన్, దళిత, గిరిజన, OBC, మైనార్టీ మోర్చా లు BJPకి ప్రధాన అనుబంధ విభాగాలు. అయితే… ఇందులో కొన్ని మోర్చాలు తమ పరిధిలో జరుగుతున్న వ్యవహారాన్ని అస్సలు పట్టించుకోవడం లేదట. పార్టీ చెప్పేంత వరకు కనీసం స్పందించడం లేదట. తాము ఉన్నామని చెప్పుకునేందుకు ఏదో పార్టీ ఇచ్చిన ప్రోగ్రాంలు అప్పడప్పుడు చేస్తున్నారని లోకల్ టాక్. ప్రధానంగా…
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ పటిష్టత కోసం ఆ పార్టీ నాయకత్వం కృషిని ప్రారంభించింది. పార్టీలో అసంతృప్తి వాదులుగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి లు పార్టీ కార్యాలయానికి వచ్చేలా చేయడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారు. ఇది పార్టీ లో ఒక్కవిజయంగా కూడా చెప్పవచ్చు. ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లోనే ఉన్నప్పటికి పార్టీలో ఎటువంటి పదవులు లేకుండా ఉన్న వారిని కూడా దగ్గరకు తీసుకునే చర్యలు పార్టీ చేపట్టినట్లుగా అయ్యింది. పోలీసుల వినియోగాన్ని…
నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు.. ఇదీ గవర్నర్ తమిళిసై మాట.. మహిళా దర్బార్ నిర్వహించిన గవర్నర్, తెలంగాణ సర్కారుకు…రాజ్ భవన్ కు మధ్య పోరుని కొత్త మలుపు తిప్పారు. ఒక సోదరిలా తెలంగాణ మహిళలకు అండగా ఉంటానని చెప్పిన గవర్నర్, గ్యాంగ్ రేప్ ఘటనపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినా ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. మహిళా దర్బార్ పై రాజకీయ వర్గాల్లో భిన్న స్పందనలు వ్యక్తమౌతున్నాయి. తెలంగాణ గవర్నర్ వర్సెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య వార్…
గుత్త సుఖేందర్‌రెడ్డి. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్. ఈయనేమో కంచర్ల భూపాల్‌రెడ్డి. నల్లగొండ ఎమ్మెల్యే. ఇద్దరూ టీఆర్‌ఎస్ నాయకులే. కానీ.. ఒకరంటే ఒకరికి పడదు. చాలా గ్యాప్ ఉందనేది గులాబీ శ్రేణులు చెప్పేమాట. ఒకరిపేరు మరొకరు వినడానికి.. పలకడానికి.. చివరకు ఎదురుపడటానికీ ఇష్టపడరని చెబుతారు. ఆ మధ్య నల్లగొండ నియోజకవర్గంలోని ప్రముఖ ఆలయానికి మండలి ఛైర్మన్ గుత్తా వెళ్తే.. ఆలయ ఈవో, అర్చకులు కనీసం ప్రొటోకాల్ పాటించలేదట. అదంతా ఎమ్మెల్యే ఆదేశాలతోనే జరిగిందనేది గుత్తా వర్గీయుల ఆరోపణ. అక్కడ…
వైసీపీలో వర్గ విభేదాలకు.. సరికొత్త రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది హిందూపురం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై అసమ్మతి ప్రభావం కనిపిస్తోంది. వీటిన్నింటి మధ్య ఎమ్మెల్సీ ఇక్బాల్ ఒంటరి పోరాటం చేస్తున్నారనే చెప్పాలి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు మహ్మద్ ఇక్బాల్. ఆయన మాజీ పోలీస్ అధికారి. ఎన్నికల్లో ఓడినా.. ఎమ్మెల్సీని చేసింది వైసీపీ. అయితే ఇక్బాల్ హిందూపురం వచ్చిన్పటి నుంచీ పార్టీలో అసమ్మతి కాక రేపుతూనే ఉంది. 2019 వరకు…
తెలంగాణ మహిళా కాంగ్రెస్లో గొడవలు చినికి చినికి గాలి వానాలా మారిపోయాయి. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తీరే వివాదాలకు కారణమన్నది కొందరి వాదన. ప్రశ్నించినా.. చెప్పిన పని చేయకపోయినా వారిని వెంటనే పార్టీ నుంచి బయటకు పంపేస్తున్నారట. ఇటీవల మహిళా కాంగ్రెస్ సమావేశం జరిగితే… ఓ రేంజ్లో రసాభాస అయ్యింది. దుర్భాషలాడారనే అభియోగాలతో మహిళా కాంగ్రెస్ సిటీ అధ్యక్షురాలు పదవి నుంచి కవితామహేష్ను తప్పించారు. ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయన్నది గాంధీభవన్ వర్గాల టాక్. మహిళా…
ఎన్నికల షెడ్యులు విడుదల కావడంతో ప్రజలు, పార్టీల దృష్టి కాబోయే రాష్ట్రపతి అభ్యర్థిపై పడింది. ఈ ఎన్నికల ద్వారా జాతీయస్థాయిలో రాజకీయ పరిణామాలు ఏలా మారతాయి? ఏ కూటమి నుంచి ఎవరు అభ్యర్ధిగా బరిలో దిగుతారో అనేదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి తమ అభ్యర్ధి గెలుపు కోసం లెక్కలతో కుస్తీ పడుతోంది. పలు పార్టీలతో మంతనాలు జరుపుతున్నారు బీజేపీ ముఖ్యనేతలు. అయితే NDAకు వ్యతిరేకంగా రాష్ట్రపతి అభ్యర్ధిగా బరిలో ఎవరు ఉంటారు?…
*ఇవాళ తిరుమలలో కరెంట్ బుకింగ్ విధానంలో జ్యేష్ఠాభిషేకం టిక్కెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ. *నేడు గుంటూరు , తెనాలి ప్రాంతాల్లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రవీణ్ పవార్ పర్యటన *నేడు శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవం. పాల్గొననున్న టీటీడీ ఛైర్మన్ &స్విమ్స్ ఛాన్సలర్ వైవీ సుబ్బారెడ్డి,ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డా. సౌమ్య స్వామినాథన్. *విశాఖ నగరానికి రానున్న కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి…