Congress : చింతన్ శిబిర్ తో ఒరిగిందేంటి ? నిర్ణయాలు గాలికొదిలేశారా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AICC ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన జాతీయస్థాయి చింతన్ శిబిర్ తర్వాత.. తెలంగాణలోనూ కాంగ్రెస్ చింతన్ శిబిర్ సమావేశాలను ఘనంగా ముగించారు రాష్ట్ర పార్టీ నాయకులు. కాకపోతే ఈ చింతన్ శిబిర్‌తో పార్టీ ఏం చెప్పాలని అనుకుంది? ఏం చెప్పింది అనేది పార్టీ కేడర్‌కు కూడా అంతుచిక్కడం లేదట. ఆ సమావేశాల్లో కాంగ్రెస్ నాయకులంతా ఓపెన్ అయ్యారు. వాటిలో పార్టీ తీసుకున్న నిర్ణయాలేంటన్నదే స్పష్టత కరువైనట్టు కేడర్ చెవులు కొరుక్కుంటోంది. అమలు చేయాల్సిన నిర్ణయాలేంటో కూడా శ్రేణులకు అర్ధం కాలేదని సమాచారం. పైగా సమావేశాల్లో తీసుకున్న రాజకీయ తీర్మానాలను కూడా పూర్తిగా ప్రకటించలేదు.
AICC ఆదేశాల మేరకు మేధోమథన సదస్సు జరిగింది తప్పితే.. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ రోల్ ఏంటి అనేది ఒక్కరూ స్పష్టత ఇవ్వలేదని గాంధీభవన్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. సామాజిక న్యాయం చేస్తాం.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యంపై గంభీరంగానే ఉపన్యాసాలు ఇచ్చారు. అయితే అంతర్గత ప్రజాస్వామ్యం.. లాబీయింగ్ ఎక్కువైన కాంగ్రెస్‌లో అవి సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నిస్తే.. దానికి సమాధానం లేదట. అంతెందుకు.. AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సైతం సమావేశాలు పూర్తిస్థాయిలో ముగియకుండానే ఢిల్లీ ఫ్లయిట్ ఎక్కేశారు. చింతన్ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాలను ఎలా అమలు చేయాలో సమీక్షించాల్సిన ఆయనే లైట్ తీసుకున్నారని కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
Also Read
కాంగ్రెస్ సమావేశాల్లో రాజకీయ తీర్మానాలే కీలకం. వాటిని పూర్తిగా బహిర్గతం చేయలేదు అని కమిటీ సభ్యులే చెబుతున్నారు. చింతన్ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్టు పార్టీ నేతలు చెప్పారు. చింతన్ శిబిర్ ముగిసి వారం అవుతున్నా.. ఇంత వరకు PAC ఊసే లేదు. జిల్లా స్థాయిలో సమావేశాలు ఉంటాయని చెప్పినా.. అవి ఎప్పుడో.. ఎక్కడ నిర్వహిస్తారో.. ఎవరు బాధ్యతలు తీసుకుంటారో చెప్పడం లేదు. వాస్తవానికి ఈ నెల 11 నుంచి 14లోపే జిల్లాలో సమావేశాలు పెట్టాలన్నది నిర్ణయం. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు కాంగ్రెస్ నాయకులు.
రాష్ట్రంలో ఘనంగా చింతన్ శిబిర్ నిర్వహించినా.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేరు. మరి.. ఆయన గైర్హాజరీలో జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అమలు చేస్తారో లేదో అనే చర్చ మొదలైంది. చింతన్ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాలపై పార్టీ వ్యూహకర్త సునీల్ టీమ్ ఆరా తీస్తున్నట్టు సమాచారం. అయినప్పటికీ ఎవరికీ చీమ కుట్టినట్టు అయినా లేదట. దీంతో సమావేశాలు పూర్తి కాగానే వాటిని అలా వదిలేశారని చెవులు కొరుకుడు ఎక్కువైంది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!