రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ వేగవంతమైంది. ఈ కేసులో భాగంగా మాజీ మంత్రి హరీష్‌రావును ప్రత్యేక విచారణ బృందం (SIT) సుదీర్ఘంగా ప్రశ్నిస్తోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన పలు కీలక అంశాలపై అధికారులు ఆయన నుంచి సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులతో ఉన్న సంబంధాలు, ఆ సమయంలో జరిగిన పరిణామాలపై సిట్ అధికారులు హరీష్‌రావును సుమారు 4…
తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన ప్రసంగాలు సాగుతున్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్‌ను కలిసి ముఖ్యమంత్రిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను “100 అడుగుల భూమిలోకి తొక్కిపెట్టాలి” అని రేవంత్…
Pakistan: భారత్‌ను ఉద్దేశించి పాకిస్తాన్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పిఆర్) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ.. పాకిస్తాన్‌పై ఆఫ్ఘనిస్తాన్ జరుపుతున్న దాడులను భారత్‌తో ముడిపెడుతూ ఆరోపణలు చేశారు. ఇటీవల, ఒక పత్రికా సమావేశంలో మహిళా జర్నలిస్టుకు కన్నుకొట్టి విమర్శలు పాలైన చౌదరి, భారత్‌ను ఎగతాళి చేసే వ్యాఖ్యలు చేశారు.
Jagga Reddy : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి మరోసారి బీజేపీపై, ముఖ్యంగా బీజేపీ నేత లక్ష్మణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన, గాంధీ కుటుంబంపై వ్యాఖ్యలు చేసిన లక్ష్మణ్‌కు అనుభవం, అవగాహన ఏమీ లేవని, చరిత్రకు గౌరవం తెలియదని మండిపడ్డారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ.. “బీజేపీ లక్ష్మణ్ వయస్సు 69 ఏళ్లు. స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు. అప్పటికి ఆయనే పుట్టలేదు. అలా ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ ఇంట్లో…
తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కొత్త అధ్యక్షులను ప్రకటించింది ఆల్‌ఇండియా కాంగ్రెస్ కమిటీ. మొత్తం 36 మంది పేర్లను ఖరారు చేస్తూ 33 జిల్లాలతో పాటు కొన్ని కార్పొరేషన్లకు కూడా కొత్త బాధ్యులను నియమించింది. పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఆయా డీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఖలీఫ్ సైదుల్లా, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడిగా దీపక్ జాన్ ను ఏఐసీసీ ప్రకటించింది. రంగారెడ్డి, సంగారెడ్డి మినహా అన్ని జిల్లాలకు డీసీసీలను ప్రకటించింది…
బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. బీహార్‌లో సుపరిపాలన, అభివృద్ధి విజయం సాధించిందన్నారు.
మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఎనిమిదేళ్లుగా సాగుతున్న రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టు ఆలస్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కొడుకు రాజకీయాల్లోకి ఎంట్రీపై సంచలన ప్రకటన చేశారు. నా కొడుకు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని తెలిపారు. అవసరమైనప్పుడు వైఎస్ రాజారెడ్డి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెడతారని తెలిపింది. నేడు తల్లితోపాటు కర్నూలు ఉల్లి మార్కెట్ పర్యటనలో పాల్గొన్నారు రాజారెడ్డి. ఉల్లి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. షర్మిల ఆశీర్వాదం తీసుకొని అమెతోపాటు కర్నూలు పర్యటనకు వెళ్లారు. వైఎస్ రాజారెడ్డి ఇంటి వద్ద నానమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకుని వెళ్లారు.…
కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో శ్రీరాముడి పేరును ఎగతాళి చేస్తూ వస్తోందని, రాముడి పట్ల వారికి గౌరవం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.
భారత దేశం అంటే హిందువులు. సెక్యులర్ దేశమని, లౌకిక రాజ్యమని ఎంత చెప్పుకున్నా.. దేశంలో 80 శాతం పైన హిందువులే. కానీ హిందువులు ఓ మతం కాదు. ఓ జాతి. అది భారతదేశపు జాతి. హిందూ ధర్మం, సనాతన ధర్మం ఈరోజు పుట్టుకొచ్చింది కాదు. వేల ఏళ్ల నుంచి హిందూ మతం ఉంది. ఇప్పుడు బీజేపీ మాత్రం సనాతన ధర్మానికి కొత్త నిర్వచనాలు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అలాగే మతానికీ, రాజకీయాలకూ ముడిపెడుతోంది. కానీ ఈ దేశంలో…