ఇన్సానియత్….మానవత్వం. జమ్హూరియత్….ప్రజాస్వామ్యం. కశ్శీరియత్ స్నేహం….ఈ మూడు తమ కాశ్మీర్ విధానాన్ని నియంత్రిస్తాయని నాడు ప్రధానిగా అటల్ బిహరి వాజ్ పేయి అన్నారు. మండుతున్న మంచులోయకు మళ్లీ వసంతం వస్తుందని, కోయిలలు తిరిగి వస్తాయని, పూలు వికసిస్తాయని ఆకాక్షించారు…వాజ్ పేయి ఆశ కావచ్చు, ఆశయం కావచ్చు…వాటిని నెరవేర్చే దిశగా అన్నట్టుగా నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాము ఎప్పటి నుంచో చెబుతున్న ఆర్టికల్ 370 రద్దు చేశారు. కాశ్మీరీ పండిట్లు తిరిగొస్తున్నారు….టూరిస్టులతో కళకళలాడుతోంది..డీలిమిటేషన్ తర్వాత ఎన్నికలు జరుగుతాయి…జమ్మూకాశ్మీరం మునుపటిలా…
తెలంగాణపై ఎన్నడూలేనంతగా ద్రుష్టిపెట్టింది భారతీయ జనతా పార్టీ. ఢిల్లీ టు తెలంగాణ గల్లీ అంటూ అలజడి పెంచుతోంది. హస్తిన పెద్దలు హైదరాబాద్ లో వరుసగా ల్యాండవుతున్నారు. తెలంగాణపై వాగ్ధానాలు కురిపిస్తూనే, టీఆర్ఎస్ సర్కారుపై వాగ్భాణాలు సంధిస్తున్నారు. తెలంగాణలో చీమ చిటుక్కుమన్నా వాలిపోతున్నారు. ప్రతి సమస్యపైనా జెట్ స్పీడ్ తో రియాక్ట్ అవుతున్నారు. ఒకరకంగా కాషాయదళం దండయాత్ర మొదలుపెట్టింది. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పించ్ హిట్టింగ్ చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది. అందులో భాగంగానే ఏకంగా జాతీయ…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకప్పుడు తిరుపతి లోక్‌సభ సీటు గెలిచిన బీజేపీ.. ప్రస్తుతం ఉందా లేదా అన్నట్టుగా మారిపోయింది. జిల్లాలో గుర్తింపు పొందిన కమలనాథులు ఏమైపోయారో అని కేడర్ ప్రశ్నించుకుంటున్న పరిస్థితి ఉంది. బాదుడే బాదుడు పేరుతో టీడీపీ నియోజకవర్గాలను చుట్టేస్తోంది. జనసేన కూడా ఏదో ఒక నిరసనతో జనాల్లో ఉండేందుకు చూస్తోంది. అధికారపార్టీ వైసీపీ గడప గడపకు మన ప్రభుత్వం అని ఊరూరా తిరుగుతోంది. ఈ రాజకీయ సందడిలో కనిపించంది బీజేపీ నేతలేనని లోకల్‌గా చెవులు…
మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ గురించి అందరికి తెలిసిందే.. అభిమానుల కోరిక మేరకు ప్రజారాజ్యం అనే కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే అనూహ్య పరిణామాలలో చిరు రాజకీయాలలో ఓటమి పాలయ్యారు. ఇక ఆ తరువాత రాజకీయాలు మనకు సరిపోవు అని సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇక అన్న బాటలోనే తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీని ప్రారంభించి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. చిరు లా కాకుండా పవన్ మాత్రం…
నందమూరి తారక రామారావు… తెలుగు సినీ వినీలాకాశంలో ఓ సంచలనం… రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై ఆయనో ప్రభంజనం. ఆయన పేరు తెలుగువాడి ఆత్మగౌరవం.. ఆయన తీరు రాజకీయ విశ్వరూపం… నటుడిగా ప్రజల గుండెల్లో కొలువైన దైవ రూపం… నాయకుడిగా ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపం. తెలుగు జాతి ఆత్మగౌరవం హస్తిన వీధుల్లో పరాభవానికి గురవుతున్న సమయంలో ఢిల్లీ అహంకారంపై తిరుగుబావుటా ఎగరేసి, తల ఎత్తి తెలుగోడి సత్తా చాటిన యుగపురుషుడు ఎన్టీఆర్. రాజకీయ వారసత్వం లేదు… తాతలు,…
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూలేనంతగా కుల రాజకీయాలు మండిపోతున్నాయి. క్యాస్ట్ కుంపట్లతో చలి కాచుకునేందుకు చాలామంది నేతలు శతవిధాలా చిచ్చు రగిలిస్తున్నారు. తమ కుల ఓట్లను తిరిగి పొందేందుకో, లేదంటే ఒక కులాన్ని రెచ్చగొట్టి, మరో కులానికి దగ్గరయ్యేందుకో మాటల మంటలు రాజేస్తున్నారు. నిజాయితీగా ప్రజల జీవితాలు బాగుచెయ్యడానికి, వారీ జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి ఇదిగో ఇలాంటి పథకాలు తెస్తాం, అలాంటి కార్యక్రమాలు చేస్తామన్న హామీలను చెప్పడం లేదు. కులాల భావోద్వేగాలను అస్త్రాలుగా సంధిస్తున్నారు. ఓటు బ్యాంకు పాలిటిక్స్…
రాజమండ్రి వైసీపీలో ఇటీవల ఊహకందని చిత్రం పొలిటికల్ తెరపై కనిపించింది. ఉప్పు నిప్పుగా ఉన్న ఎంపీ మార్గాని భరత్.. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు దోస్త్ మేరా దోస్త్ అన్నట్టుగా కలిసిపోయారు. ఈ మూడేళ్ల కాలంలో ఇద్దరు యువ నేతలు అనేకసార్లు రచ్చకెక్కారు. పార్టీ అధిష్ఠానం సైతం సయోధ్యకు విఫలయత్నం చేసింది. భరత్, రాజాలు కలవడం అసాధ్యమని అనుకున్నారు. కానీ.. విభేదాలను పక్కన పెట్టేసినట్టు ఎంపీ, ఎమ్మెల్యేలు స్వయంగా ప్రకటించడంతో అంతా ఆశ్చర్యపోయారు. వైసీపీలో సంస్థాగతంగా చేపట్టిన…
సుబ్రహ్మణ్యం మృతి కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు హంతకుడని వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. రాష్ట్రమంతా ఈ వ్యవహారం గందరగోళంగా మారినా, ఎమ్మెల్సీ లైట్ తీసుకున్నారు. ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. చివరకు ఆయన మెడకే ఉచ్చు బిగుస్తోంది. అయితే, ఇప్పుడు దీని వెనక ఆసక్తికర చర్చ జరుగుతోందట. ఘటన జరిగినప్పుడు అనంతబాబు ద్వారంపూడిని కాంటాక్ట్ అయ్యారా?అనంత బాబు రెండు పదవులు రావడంలో ద్వారంపూడి కీ రోల్?సమస్య పరిష్కారమైందని అనంతబాబు ఊహించారా?ఎవరూ ఏమి చేయలేని స్థాయికి పరిస్థితులు…