Trump: అదంతా అబద్దం.. అంతర్జాతీయ కథనాలపై ట్రంప్ క్లారిటీ
- ఇరాన్ యుద్ధంపై భిన్న కథనాలు
- అంతర్జాతీయ కథనాల్లో అస్పస్టత
- క్లారిటీ ఇచ్చిన అధ్యక్షుడు ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత నెల 28న అకస్మాత్తుగా ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ దాడి చేసి అత్యున్నత పదవిలో ఉన్న అయతుల్లా ఖమేనీ సహా కుటుంబ సభ్యులు, అధికార పెద్దలను అంతమొందించింది. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులకు దిగాయి. అయితే తాజాగా అంతర్జాతీయ మీడియాలో కొత్త కథనాలు వెలువడుతున్నాయి. ఇరాన్‌పై యుద్ధానికి అమెరికాకు అంత తొందరలేకపోయినా.. ఇజ్రాయెలే ఉసికొల్పిందని.. దీంతో అమెరికా కూడా రంగంలోకి దిగాల్సి వచ్చిందని కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం ట్రంప్ ప్రభుత్వం పని చేస్తోందని డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ క్లారిటీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Gold Rates: యుద్ధ సమయంలో మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Also Read
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
ఓవల్ కార్యాలయంలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌పై యుద్ధం చేసేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తనను ఒప్పించారనే వాదనను ట్రంప్ తోసిపుచ్చారు. ఇజ్రాయెల్ ఒత్తిడితోనే యుద్ధంలోకి దిగినట్లుగా వస్తున్న ఆరోపణలు అవాస్తవం అని ఖండించారు. ఇజ్రాయెల్ కాదు.. తామే ఇరాన్‌పై యుద్ధాన్ని నిర్ణయించినట్లుగా చెప్పుకొచ్చారు. టెహ్రాన్‌పై దాడి చేసింది తామేనని పేర్కొన్నారు. ఇరాన్ తమపై భారీ దాడులకు కుట్ర పన్నడంతో ముందుగా అమెరికానే దాడి చేసిందని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు.
అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రతీకారం తీర్చుకునేలా ఇజ్రాయెల్ కార్యకలాపాలు జరుగుతున్నట్లుగా వాషింగ్టన్ ఊహించిందని ఇటీవల అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వ్యాఖ్యానించారు. దీంతో ఇజ్రాయెల్ ఒత్తిడితోనే ఇరాన్‌పై అమెరికా యుద్ధానికి దిగిందని అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నారు. తాజాగా ఆ కథనాలను ట్రంప్ ఖండించారు. మార్కో రూబియోకు వ్యతిరేకంగా ట్రంప్ మాట్లాడారు. తామే ఇరాన్‌పైకి యుద్ధానికి దిగినట్లుగా చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: US-Iran: దుబాయ్‌పై ఇరాన్ మళ్లీ దాడులు.. అమెరికా ఎంబసీలో భారీగా మంటలు
తాజావార్తలు
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
-
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!