Bihar Election Results: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమిని తుడిచిపెట్టేసింది.
Tamil Nadu Sasikala : తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు వి.కె. శశికళ కీలక ప్రకటన చేశారు. అన్నాడీఎంకే పార్టీలో మళ్లీ చేరాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పార్టీలోకి తన పునరాగమనం ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే ఘోర పరాజయం పాలవుతుందని భావించాల్సిన అవసరం లేదన్నారు. 2026 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ గెలిచి అమ్మ పాలనకు నాంది పలుకుతామన్నారు. ప్రతిపక్ష నేతగా కె. పళని స్వామి అడగాల్సిన ప్రశ్నలను ప్రస్తుత ప్రభుత్వాన్ని అడగడం…
ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ.. సమస్యలను పరిష్కరించుకుంటూ.. అభివృద్ధి పథం వైపు సాగుదామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ట్విటర్(ఎక్స్) ద్వారా అభినందనలు తెలియజేశారు.
ఏపీలో ఫలితాల్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. కూటమికి భారీ ఎత్తున సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం చతికల పడింది. దీంతో ఈ రోజు ముఖ్యమంత్రి పదవికి ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజీనామా చేశారు.
రాష్ట్ర కేడర్ అధికారులను ఐఏఎస్ లుగా ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రతిపాదనలు పంపడం నిబంధనలకు విరుద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం యూపీఎస్సీ ఛైర్మనుకు చంద్రబాబు లేఖ రాశారు.
Kisan Reddy : పార్లమెంటు ఎన్నికలు బీజేపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని కమలం పార్టీ భావిస్తోంది. దేశవ్యాప్తంగా 400 ప్లస్ సీట్లు టార్గెట్‌గా పెట్టుకోగా తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో గెలవాలని భావిస్తోంది.
Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్మీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ హై కమాండ్‌కు పంపారు. ఎమ్మెల్యేల తిరుగుబాటు, అసమ్మతి నేపథ్యంలో సీఎంను మార్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది.
వైసీపీని వీడుతున్నట్లు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు. సీఎంఓలో పార్టీ కీలక నేతలను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు టికెట్ లేదని చెప్పారని ఈ సందర్భంగా వెల్లడించారు.
బీసీల్లో ఎంత మందికి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు ఇవ్వగలమో అంతమందికి ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు ఆధ్వర్యంలో ‘జయహో బీసీ’ వర్క్ షాప్ జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రసంగించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి కుటుంబంతో పాటు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెళ్లారు. భర్త అనిల్, కుమారుడు వైఎస్ రాజారెడ్డి, కుటుంబసభ్యులతో కలిసి కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు చేరుకుని, అక్కడి నుంచి ముఖ్యమంత్రి నివాసానికి షర్మిల వెళ్లారు.