Bihar Election Results: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమిని తుడిచిపెట్టేసింది. మరోసారి, జేడీయూ-బీజేపీ కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంది. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్‌లో ఎన్డీయే కూటమి ఏకంగా 202 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 89, జేడీయూ 85, చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ 19లతో పాటు మిగిలిన స్థానాలను ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు గెలుచుకున్నాయి. మరోవైపు, తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ కేవలం 25 సీట్లను మాత్రమే గెలుచుకుని దారుణ ఓటమిని చవిచూసింది.
Read Also: Religious Conversion: దర్శనానికి పాకిస్తాన్ వెళ్లింది, మతం మారి పెళ్లి చేసుకుంది..
ఇదిలా ఉంటే, ఈ పరాజయంపై తొలిసారిగా ఆర్జేడీ స్పందించింది. ‘‘ అంతునేని ప్రజాసేవ ప్రయాణంలో ఒడిదుడుకులు అనివార్యమైనవి. ప్రజాసేవ నిరంతర ప్రక్రియ, అంతులేని ప్రయాణంలో హెచ్చ తగ్గులు అనివార్యం. ఓటమితో బాధపడము, విజయంతో అహంకారానికి పోము’’ అని హిందీలో ఆర్జేడీ ట్వీట్ చేసింది. తమని పేదల పార్టీ అని తమ గొంతుకను వినిపిస్తూనే ఉంటామని చెప్పింది. ఆర్జేడీ నేతృత్వంలోని కాంగ్రెస్, కమ్యూనిస్టుల కూటమి ‘‘మహా ఘట్బంధన్’’ మొత్తంగా 35 సీట్లను మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ 6 స్థానాలను గెలుచుకుంది.