Kapu Ramachandra Reddy: వైసీపీని వీడుతున్నట్లు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు. సీఎంఓలో పార్టీ కీలక నేతలను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు టికెట్ లేదని చెప్పారని ఈ సందర్భంగా వెల్లడించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపుకు టికెట్ లభించకపోవడంతో ఇండిపెండెంట్‌గానైనా బరిలోకి దిగుతానని ఆయన వెల్లడించారు.
Read Also: Gopireddy Srinivasareddy: వచ్చే ఎన్నికల్లో నరసారావుపేట నుంచే పోటీ చేస్తున్నా..
రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. “నేను వైసీపీకి రాజీనామా చేస్తున్నాను. నేను సీఎం మాట ఇంతవరకు మీరలేదు. ఇప్పుడు సర్వే పేరు చెప్పి నా గొంతు కోశారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం రెండు చోట్ల నుంచి నేను, నా భార్య పోటీ చేస్తాము. రాయదుర్గం నుంచి నా భార్య తప్పని సరిగా పోటీ చేస్తారు. సీఎంను కలిసి మాట్లాడడం మాకు కుదరలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కలిసే అవకాశం రాలేదు. ఇంత కన్నా అవమానం మాకు ఎప్పుడు జరగలేదు. నమ్మించి తెచ్చి మా గొంతు కోశారు. స్వతంత్రంగా లేదా అవకాశం కల్పించిన ఏ పార్టీ నుండి అయినా పోటీకి సిద్దం. ఇప్పటి వరకు నేను ఒక్కసారీ వేరే పార్టీతో మాట్లాడలేదు. మా ఇంటి నిండా లైట్‌లు వేస్తే జగన్ ఫోటోలే కనబడతాయి.”అని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు.