ఇక మాటలుండవ్.. మాట్లాడుకోవడాలుండవ్.. తేడా జరిగితే అంతే సంగతులు. పదవి ఉంది కదా.. పార్టీ పవర్‌లో ఉంది కదా.. ఎంజాయ్ చేసేద్దాం.. అనుభవించు రాజా అంటూ ఆడుతూ పాడుతూ గడిపేద్దామంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు చెప్పేసిందట అధినాయకత్వం.
Off The Record: తెలంగాణ కమలం లొల్లి ఇప్పట్లో కొలిక్కి రాదా? ఎడ్డెమంటే తెడ్డెమనే నైజం మారదా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో అది మరింత ముదిరిందా? ఓ వైపు డిపాజిట్ కూడా దక్కకుండా జనం కర్రుగాల్చి వాత పెట్టినా.
TPCC Mahesh Goud : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని, మంచి మెజారిటీ సాధిస్తామని వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ అంతర్గత విషయాలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని మహేష్ గౌడ్ తెలిపారు. “మా ప్రభుత్వం జూబ్లీహిల్స్‌లో 46…
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం కోర్ట్ తీర్పు బీఆర్‌ఎస్‌కు బూస్ట్ ఇచ్చిందా? అదే ఊపులో మరో న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించిందా? ఈసారి పెద్దల సభవైపు గులాబీ పెద్దల దృష్టి మళ్ళిందా? ఆ దిశగా ఇప్పుడేం చేయాలనుకుంటోంది కారు పార్టీ? ఏంటా సంగతులు? బీఆర్‌ఎస్ బీ ఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న పది మంది శాసనసభ్యుల విషయంలో స్పీకర్ మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పింది సుప్రీం కోర్ట్. అయితే…ఈ మూడు నెలల్లోపు…
సమావేశానికి గైర్హాజరై 15మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉండటంపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజవర్గాల్లో ప్రజలకు దూరంగా ఉoడటo సరికాదని ముగింపు సందేశంలో గట్టిగా క్లాస్ పీకారు. ఆహ్వానితుల్లో 56మంది గైర్హాజరయ్యారంటూ సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఉదయం ఎంత మంది వచ్చారు, సంతకాలు పెట్టి ఎంత మంది వెళ్లిపోయారు,
మంచి నాయకులకే ప్రజల్లో గుర్తింపు, గౌరవం ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటి టీడీపీ కార్యక్రమంపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాలోకేష్‌ను సీఎం కొనియాడారు.
సీనియర్లు పార్టీకి కాపలా కాశారని.. సీనియర్ల సహకారం పార్టీకి అవసరమని మంత్రి నారాలోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి లోకేశ్ ప్రసంగించారు. ఎన్నికల్లో గెలుపు వెనుక కార్యకర్తల కష్టం ఉందని గుర్తు చేశారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కష్టపడాలన్నారు. మంచి పనులు చేయాల్సిన బాధ్యత మనపై ఉందని స్పష్టం చేశారు. 151 సీట్లు 11 అయ్యాయంటే దానికి కారణం వారి అహంకారమని విమర్శించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇక రైతుల పక్షాన మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం జరగనుంది.
KCR : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశం ఆయన నివాసమైన ఎర్రవల్లి ఫామ్ హౌస్ (Erravalli Farm House) లో జరిగింది. ఈ సమావేశానికి మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల నుంచి పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పలు…