ఓ పెద్ద నాయకుడికి ఆయన వారసుడు. మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం విపక్షపార్టీలో ఉన్నా పెద్దగా చప్పుడు లేదు. కానీ.. తండ్రి వర్ధంతి రోజున సంచలన వ్యాఖ్యలు చేసి.. ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు. ఇంతకీ అది వ్యూహమా? నిజంగా ఆయన చెప్పినట్టు జరిగిందా? తన హత్యకు రెక్కీ నిర్వహించారంటూ వంగవీటి రాధాకృష్ణ చేసిన ఆరోపణపై బెజవాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తన పని తాను చేసుకుపోయే రాధాను హతమార్చేంత అవసరం ఎవరికి ఉంటుందనేది ఓ ప్రశ్న.…
కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజావ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపిస్తూ రోడ్డెక్కాయి విపక్ష పార్టీలు. భారతబంద్ పాటించాయి. ఈ విపక్షపార్టీల బృందానికి దూరంగా ఉండిపోయింది అధికారపార్టీ టీఆర్ఎస్. బంద్‌కు దూరం వ్యూహాత్మకమా? ఇంకేదైనా బంధాలకు బాట పడుతోందా? రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? భారతబంద్‌కు దూరంగా ఉన్న టీఆర్ఎస్‌పై చర్చ..! పెరిగిన పెట్రోల్, నిత్యావసరాల ధరలతోపాటు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భారత్ బంద్ పాటించాయి కాంగ్రెస్, వామపక్షపార్టీలు. దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలు కొన్ని…