TPCC Mahesh Goud : జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయం.. హైకమాండ్ రాడార్‌లో అందరూ..
- జూబ్లీహిల్స్‌లో మెజారిటీతో గెలుస్తాం
- హైకమాండ్ అందరినీ గమనిస్తోంది
- కులం, మతం మాట్లాడటం ఆక్షేపణీయం
- బీజేపీ మతం పేరుతో ఓట్లు దండుకుంటోంది: మహేష్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Mahesh Goud : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని, మంచి మెజారిటీ సాధిస్తామని వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ అంతర్గత విషయాలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని మహేష్ గౌడ్ తెలిపారు. “మా ప్రభుత్వం జూబ్లీహిల్స్‌లో 46 వేల ఇళ్లకు సంక్షేమ పథకాలు అందిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువవుతున్నాయి. ఇది మా బలం,” అని ఆయన పేర్కొన్నారు. గత దశాబ్దంగా ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుస్తున్నప్పటికీ, ఓటు చోరీ ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి పోరాడుతున్నారని ఆయన గుర్తు చేశారు.
Also Read
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
రాష్ట్రంలోని అన్ని పరిస్థితులను కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో ఉంచుకుందని, అందరూ దాని రాడార్‌లో ఉన్నారని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. “మంత్రుల మధ్య గొడవలు ముగిసిన అధ్యాయం. ఎవరైనా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి,” అని ఆయన సూచించారు. కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య ఇటీవల జరిగిన వివాదంపై మాట్లాడుతూ, “కొందరు అలా మాట్లాడకూడదు. పోలీసుల వల్ల కొంత గందరగోళం జరిగింది, అది కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమే,” అని వివరించారు. ఈ సమస్యలపై హైకమాండ్‌కు రిపోర్ట్ సమర్పించామని తెలిపారు.
కొంతమంది ఎమ్మెల్యేలకు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని మహేష్ గౌడ్ వెల్లడించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. “ఎమ్మెల్యేలు డీసీసీ బాధ్యతలు తీసుకోవడం మంచిది. ఇవి డబుల్ పోస్టులుగా చూడకూడదు,” అని ఆయన అన్నారు. కుటుంబాలు పార్టీలో సేవలు అందిస్తుంటే అడ్డంకి ఉండదని, కానీ ఉన్నపలంగా పదవులు అడిగితే ఇవ్వరని స్పష్టం చేశారు. “రెండు పదవులు ఉండకూడదనే నిబంధన ఉంది. ఒక పదవికి ఎంపికైతే, మరొకటికి రాజీనామా చేయాలి,” అని ఆయన వివరించారు.
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు ఇటీవలి ఘటనలను తమకు అనుకూలంగా మలచుకుంటున్నారని మహేష్ గౌడ్ విమర్శించారు. “పార్టీ నియమావళికి అందరూ కట్టుబడి ఉండాలి,” అని ఆయన పేర్కొన్నారు. జీవన్ రెడ్డి, లక్ష్మణ్ మధ్య గురు-శిష్య బంధం గురించి మాట్లాడుతూ, పార్టీ ఆదేశాలకు లోబడి నడవాలని సూచించారు.
బీజేపీపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. “బీజేపీ ఎప్పుడూ మతం, కులం పేరుతో ఓట్లు దండుకుంటుంది. కిషన్ రెడ్డి సికింద్రాబాద్‌కు ఏం చేశారు? కేంద్ర మంత్రిగా బండి సంజయ్ చిల్లరగా మాట్లాడారు,” అని ఆరోపించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సరైన సహకారం లభించడం లేదని, మెట్రో ఫేస్-2 ప్రాజెక్టుకు కిషన్ రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. అయినప్పటికీ, తమ అభిప్రాయాలను హైకమాండ్‌కు పంపినట్లు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తన సూచనలు సమర్పించారని తెలిపారు.
“రాజకీయాలు ఎన్నికల వరకే. అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలి,” అని మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు. వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం కాంగ్రెస్ సంస్కృతి కాదని, మాగంటి కుటుంబ విషయాలు మీడియా ద్వారానే తెలిసాయని చెప్పారు. ఒక్కో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అధికారులు, మంత్రులు జవాబుదారీగా ఉండాలని ఆయన సూచించారు.
Donald Trump: మలేషియాలో డాన్స్ చేసిన యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ (వీడియో)
తాజావార్తలు
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!