Off the Record: పని మొదలు పెట్టకముందే… టార్గెట్ ఫిక్స్ అయిపోయిందా..? తేడా వస్తే ఇక అంతేసంగతులంటూ… మెడ మీద వేలాడుతున్న కత్తిని చూపిస్తున్నారా? తెలంగాణ కాంగ్రెస్‌లో ఇన్నాళ్లు ఒక లెక్క, ఇకపై ఇంకో లెక్క అన్నట్టుగా వాతావరణం మారబోతోందా? ఏ నాయకులకు టార్గెట్స్ ఫిక్స్ అయిపోయాయి? తేడా వస్తే ఎలాంటి పనిష్మెంట్ ఉండబోతోంది?
Read Also: High Tension in Vijayawada: విజయవాడ భవానీపురంలో హై టెన్షన్..
ఇక మాటలుండవ్.. మాట్లాడుకోవడాలుండవ్.. తేడా జరిగితే అంతే సంగతులు. పదవి ఉంది కదా.. పార్టీ పవర్‌లో ఉంది కదా.. ఎంజాయ్ చేసేద్దాం.. అనుభవించు రాజా అంటూ ఆడుతూ పాడుతూ గడిపేద్దామంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు చెప్పేసిందట అధినాయకత్వం. కొత్త డీసీసీ అధ్యక్షులకు సీఎం రేవంత్‌రెడ్డి టార్గెట్స్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. వాళ్ళింకా పనే మొదలుపెట్టలేదు. కానీ… కుర్చీలో కూర్చోబోయే ముందే కొత్త లక్ష్యాల గురించి వివరించి ఏం చేయాలి? ఎలా ప్రొసీడ్ అవ్వాలో సూటిగా, సుత్తిలేకుండా చెప్పేయాలనుకుంటున్నట్టు సమాచారం. జిల్లా అధ్యక్షులుగా నియమితులైన వారు ఏమేం పనులు చేయాలో, ఎలా వ్యవహరించకూడదో చెప్పారట సీఎం. అలాగే పార్టీ చెప్పినట్టు చేయకుంటే ఏం జరుగుతుందో కూడా.. ముందే బొమ్మ చూపించేసినట్టు తెలుస్తోంది. అధికార పార్టీకి జిల్లా అధ్యక్షుడు అవడమంటే ఆషామాషీ కాదు అంటూనే.. వారి పని ఏంటన్న అంశం విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశారు. తేడా వచ్చిందంటే తప్పించేస్తాం అని కూడా ముందే చెప్పేసి మానసికంగా అందుకు సిద్ధమై కుర్చీలో కూర్చోమన్నారట.
Read Also: Off The Record: పరకాల ఎమ్మెల్యే తీరుపై కాంగ్రెస్ లో అసంతృప్తి
డీసీసీ అధ్యక్షులుగా ఎంపికైన వాళ్ళకు వచ్చే ఆరు నెలలు ట్రైనింగ్ పీరియడ్ అని, ఇక నుంచి ప్రతి ఆరు నెలలకు ఒకసారి పనితీరును సమీక్షించి… తేడా వస్తే తప్పించాలంటూ… పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు సూచించారట రేవంత్. దీన్నిబట్టి కొత్తగా ఎన్నికైన dcc అధ్యక్షులు ఇక నుంచి పని చేయకుండా పార్టీ నాయకులు, మంత్రుల చుట్టూ తిరుగుతామంటే కుదరదు… మెడ మీద కత్తి వేలాడుతోందని హెచ్చరించినట్టయింది. ముఖ్యంగా మహిళా ఓటు బ్యాంక్ మీద దృష్టి పెట్టిన సీఎం రేవంత్… గ్రామాల్లో ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర సారె అందిందో లేదో చూసే బాధ్యత జిల్లా పార్టీ అధ్యక్షులదేనని తేల్చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది కాబట్టి… వచ్చే మూడేళ్ళు కీలకం. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రచారంలో పెట్టడం.. ప్రజల వద్దకు వెళ్ళడం అనేది కీలకమైన టాస్క్. వీటిలో ఎక్కడ తేడా వచ్చినా.. పదవులకు గండం తప్పదని డీసీసీ అధ్యక్షులకు సీరియస్‌గానే చెప్పేశారు సీఎం.
Read Also: CM Chandrababu: దివ్యాంగులపై సీఎం చంద్రబాబు వరాల జల్లు..
పాత పద్ధతికి అలవాటు పడితే కుదరదని, పరుగులు పెట్టాల్సిందేనని క్లారిటీ ఇచ్చారాయన. అప్పగించిన పని చేయకపోయినా, ఆశించిన స్థాయిలో పెర్ఫార్మెన్స్ లేకపోయినా…తప్పించడం ఖాయం, అందులో మొహమాటాలకు, పైరవీలకు తావు లేదన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులం అయ్యాం. పని మానేసి పెత్తనం చేద్దామనుకునే బాపతు ఎక్కువగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. అసలు పని మానేసి కొసరు వాటికి ప్రాధాన్యం ఇచ్చే బ్యాచ్‌కు కొదవే ఉండదు. అందుకే… సీఎం అంత సీరియస్‌గా చెప్పారట. మొదటి రోజే ఫైనల్ ఎగ్జామ్స్‌కు కావాల్సినంత హోమ్‌వర్క్ ఇచ్చి పంపారు. దీంతో…. ఇకనైనా డీసీసీల తీరు మారుతుందా? పాత వాసనలు పోయి పరుగులు పెడతారా? పార్టీని మరోసారి విజయ తీరాలకు చేరుస్తారా అంటూ ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.