మాజీ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు రాష్ట్రం వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రిమాండ్ ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు రాజమహేంద్రవరం జైలులో తోటి ఖైదీపై దాడి చేశారని సమాచారం. ఏదో విషయంపై ఇద్దరికి మాటామాటా పెరగడంతో ఎమ్మెల్సీ కోపంతో అతనిపై చెయ్యి చేసుకున్నారని తెలుస్తోంది. అయితే.. నిబంధనల ప్రకారం జైలులో ఉన్న ఖైదీలపై చిన్న గీత పడినా అక్కడి ఆసుపత్రిలో కారణం చెబితే తప్ప చికిత్స చేయరు. ఈ నేపథ్యంలో.. చికిత్స చేయించుకునే స్థాయిలో దెబ్బలు తగల్లేదన్న వాదన కూడా వినిపిస్తోంది.
జైలులో సకల రాచమర్యాదలు మరో పక్క ఎమ్మెల్సీ అనంతబాబుకు జైల్లో సకల సౌకర్యాలు అందుతున్నాయని కూడా కొందరు వాదిస్తున్నారు. రెండు రోజులకే పడుకునేందుకు పరుపు ఏర్పాటు చేశారని, కోరిన ఆహారం బయటి నుంచి అందుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్సీని జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులపై స్థానిక నేతలు పెద్ద స్థాయి నాయకుల నుంచి తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు, నిబంధనల ప్రకారం ఖైదీలు ముగ్గురికి ఒక గది కేటాయిస్తారు. ఎమ్మెల్సీ ఒక్కరినే ఓ గదిలో ఉంచారని తెలుస్తోంది.