వైసీపీ సర్కారుపై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర విమర్శలు చేశారు. గృహనిర్మాణంపై మంత్రి జోగి రమేష్ రోగి రమేష్‌లా అసత్యాలు మొరుగుతున్నారని మండిపడ్డారు. గృహనిర్మాణం, ఇళ్ల పట్టాల విషయంలో జగన్ రెడ్డి అండ్ కో కోట్లాది రూపాయలను స్వాహా చేశారని ఆయన ఆరోపించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో 7.82 లక్షలకు పైగా పేదలకు పక్కా గృహ నిర్మాణం జరిగిందని అసెంబ్లీలో గత మంత్రి రంగనాథరాజు స్వయంగా వెల్లడించారని గుర్తుచేశారు. గత మూడేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్…
పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు వారికి ఒప్పించాలిసింది పోయి రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులుకు గురి చేస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. గౌరవెల్లి ప్రజలు ప్రాజెక్ట్ కి సహకరిస్తామని చెప్పారని అయినా.. అర్థరాత్రి వందలాది మంది పోలీస్ లు ఇళ్ళ నుండి ఈడ్చుకొచ్చి విచక్షణ రహితంగా కొట్టారని ఆయన మండిపడ్డారు. నిర్వాసితులపై పోలీసుల లాఠీ ఛార్జీ దారుణమని, గతంలో కూడా రాత్రికి రాత్రే వీరిపై దాడి చేసి రోడ్ మీద పడేశారని ఆయన అగ్రహం…
సిద్దిపేటలో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 8సంవత్సరాల ప్రజా సంక్షేమ పాలన సదస్సుకు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాషాయ జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరాలని చాలామంది ఎదురు చూస్తున్నారని, నల్గొండ జిల్లాకు నేను వెళ్తే నాకు అక్కడ ప్రజలు బ్రహ్మరతం పడితే.. కేసీఆర్ చానెల్, పేపర్ ఖాళీ కుర్చీలు చూపించాయి.. ఆ చానెల్‌ని ఎవరూ చూడరు వారు తప్ప అంటూ ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ…
ఇటీవల సీఎం కేసీఆర్ మాజీ మంత్రి, సీనియర్ నాయకులు ఉండవల్లి అరుణ్ కుమార్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్మీ అధికారులు హనీ ట్రాప్ లో పడినట్లుగా.. కేసీఆర్ హాని ట్రాక్ లో ఉండవల్లి పడ్డారని ఆయన ఎద్దేవా చేశారు. మంచి పండితుడు.. ఏం చూసి కేసీఆర్ దగ్గరికి ఉండవల్లి వెళ్ళాడో తెలియదంటూ ఆయన సెటైర్లు వేశారు.…
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు ఏం ముఖం పెట్టుకుని సిద్దిపేట, గజ్వేల్ లో తిరుగుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుబంధం చేయాలని, ఇప్పటికే మూడుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని, ఆ పని చేసుకొచ్చి మీ ముఖం చూపియండంటూ ఆయన విమర్శలు గుప్పించారు.…
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు. ఈ అంశంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. టీడీపీ గత సంప్రదాయాన్ని పాటించింది కాబట్టే ఆత్మకూరు ఉపఎన్నికలో టీడీపీ పోటీ పెట్టలేదని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే, ఎంపీలు మరణించిన స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో కుటుంబ సభ్యులు నిలబడితే పోటీ చేయకూడదనే ఉత్తమ సంప్రదాయాన్ని టీడీపీ పాటిస్తోందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఇప్పుడు ఆత్మకూరు ఉప ఎన్నికల విషయంలో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోందని…
ఎంబీసీ కులాలకు నరేంద్రమోదీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని బీజేపీ ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీఎం మత్స్య సంపద పేరుతో అద్భుతమైన పథకాన్ని కేంద్రం ప్రారంభించిందని, వెంచర్ క్యాపిటల్ ఫండ్ ను కాంగ్రెస్ హయాంలో కేవలం ఎస్సిలకే పరిమితం చేసిందన్నారు. అంతేకాకుండా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక వెంచర్ క్యాపిటల్ ఫండ్ ను బీసీలకు కూడా కల్పించిందన్నారు. తెలంగాణలో బీసీ రుణాలు ఆటకెక్కాయి…
మరోసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. శనివారం కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కల్వకుంట్ల కుటుంబ తాటాకు తప్పుళ్ళకు భయపడమని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తానే పెద్ద నాయకుడిగా కేసీఆర్ ఊహించుకుంటున్నాడని, ఫాంహౌస్ లో కూర్చుని కేసీఆర్ కంటోన్న కలలు కల్లలుగా మిగిలిపోతాయని ఆయన ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ సరిపోవటం లేదు.. దేశాన్ని పంచుకోవాలనుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీని కేసీఆర్ పొగుడుతాడని ఎవరు అనుకుంటారు? టీఆర్‌ఎస్ ప్రభుత్వ…
మూడేళ్ల వైసీపీ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల వైసీపీ పాలనలో ఏపీని వల్లకాడు చేశారని ఆయన ఆరోపించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని.. తమ బాధలను చెప్పుకునే వీల్లేకుండా ప్రజల నోళ్లను నొక్కి పెట్టారని విమర్శించారు. దీంతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని.. చాలాచోట్ల కొందరు హత్యలకు గురయ్యారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ హయాంలో 60 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారన్నారు. 4 వేల మంది టీడీపీ వారిపై కేసులు…
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు వస్తే టీడీపీ కార్యాలయానికి తాళం వేస్తామని అచ్చెన్నాయుడు సంచలన ప్రకటన చేశారు. 175 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని జగన్కు అంత నమ్మకమేంటని ప్రశ్నించారు. నిజంగా అంత నమ్మకం ఉంటే జగన్ ఇప్పుడే ఎన్నికలకు వెళ్లాలని అచ్చెన్నాయుడు సవాల్ చేశారు. తక్షణమే గవర్నర్ను కలిసి ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు జగన్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అసలు…