కుల గణనపై తెలంగాణ బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో బీజేపీ, సీపీఐ, బీఆర్ఎస్ కూడా పాల్గొన్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయికి సర్వే వెళ్ళిందని.. కిషన్ రెడ్డికి ఈ విషయం తెలుసుకోవాలన్నారు. ఇంటి ఇంటికి అధికారులు వెళ్లి సర్వే చేశారన్నారు. కుల గణనపై కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. రేవంత్ సక్సెస్ అయ్యాడు కాబట్టి డైవర్ట్ చేసి బురద జల్లే ప్రయత్నం చేయకండన్నారు.
Jagga Reddy : మాజీ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ సీనియార్ నాయకులు జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. హరీష్ నువ్వు బయట చాలా బిరుదులు తెచ్చుకున్నావని, ఒకడు ట్రబుల్ షూటర్ అంటారని, ఇంత పరిజ్ఞానం ఉన్న నువ్వు.. చిన్న లాజిక్ మర్చిపోయావన్నారు జగ్గారెడ్డి. గల్లీ నుండి ఢిల్లీ రాజకీయం వరకు కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనా? బీజేపీ పుట్టకముందే RSS ఉన్నది, అయితే ఈ రెండు పార్టీలు రాజకీయ అవగాహన కలిగి…
Jeevan Reddy : జిల్లా కేంద్రంలో నిర్వహించిన “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” సభలో రాజకీయ వేడి పెరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మడిగే సంజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు. సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జీవన్ రెడ్డి మాట్లాడుతూ, “కాంగ్రెస్ ముసుగులో వచ్చిన వాళ్ల కంటే మనం గట్టిగానే ఉన్నాం.…
తాను మంత్రి పదవి కోసం ఢిల్లీలో పైరవీలు చేయనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. ఖమ్మంలో 9 మంది గేలిస్తే 3 మంత్రి పదవులు వచ్చాయని తెలిపారు. మరి నల్లగొండలో 11 స్థానాలు గెలుస్తే మంత్రి పదవులు రెండేనా? అన్నారు.
Harish Rao : తెలంగాణ రాష్ట్రానికి గత పదేళ్లలో సాధించిన అభివృద్ధిని ఒక్క సంవత్సరంలోనే వెనక్కి నెట్టి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన దెబ్బ కొట్టారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో గణనీయమైన తగ్గుదల నేపథ్యంలో, ట్విటర్ వేదికగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హరీష్ రావు పేర్కొన్న వివరాల ప్రకారం, బీఆర్ఎస్ పాలనలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతి సంవత్సరం సగటున 25.62 శాతం…
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు ప్రాజెక్టులు కూలిపోయాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లాలోని చిన్నకొడుర్ మండలం చౌడారం వద్ద బిక్కబండకు వెళ్లే కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం కాలువల భూ సేకరణ కోసం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు.
వక్ఫ్ బోర్డు బిల్లుపై పార్లమెంటులో రాహుల్ గాంధీ వెన్నుచూపారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడారు. మైనారిటీలపై కాంగ్రెస్ కపట ప్రేమ చూయిస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మైనారిటీల హక్కులను కాలరాసి కీలకమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చలో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం దారుణమన్నారు. ప్రియాంక గాంధీ అతి ముఖ్యమైన ఈ బిల్లు సమయంలో పార్లమెంటుకు హాజరు కాకపోవడం అత్యంత దారుణమని…
Addanki Dayakar Rao : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బీజేపీ(BJP)పై, కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఘాటు విమర్శలు చేశారు. బండి సంజయ్ ని కేంద్ర మంత్రిగా ఎందుకు చేశారో వారికే తెలియాలని, ఆయనను త్వరగా ఎవరికైనా చూపిస్తే అందరికీ మంచిదని అన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు దేశభక్తులు, దేశ ద్రోహులు ఎవరో కూడా తెలియదని విమర్శించారు. ఇలాంటి వారిని ఎంపీలుగా చేసి కేంద్ర ప్రభుత్వం ఎవరిని ఉద్ధరించాలనుకుంటుందో అర్థం కావడం…
మోడీ అంటే నాకు గొప్ప గౌరవమని సీంఎ రేవంత్ రెడ్డి అన్నారు. కానీ అభివృద్ధి అంత హైదరాబాద్.. చెన్నె.. బెంగుళూరు చెందిందన్నారు. గుజరాత్, యూపీ నుంచి మన దగ్గరకు ఉద్యోగాల కోసం వస్తున్నారని సీఎం తెలిపారు. వేరే ప్రాంతాల వాళ్లు మీ దగ్గరకు ఎందుకు రావడం లేదు? అని ప్రశ్నించారు. మేము అభివృద్ధి మేము సాధించినట్టా? లేక మీరు చేసినట్టా? అని మోడీని అడిగారు. రవీంద్ర భారతిలో బిల్డ్ నౌ పోర్టల్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్…
నలభై ఏళ్ల ప్రజా జీవితంలో ప్రగతిశీల బడ్జెట్ నిన్న చూశానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బడ్జెట్ దేశానికే ఆదర్శంగా ఉందని కొనియాడారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి బడ్జెట్ రూపొందించారని..ఎన్నికల వాగ్దానాలను కాకుండా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ఉందన్నారు. బీఆర్ఎస్ నుంచి రూ.7 లక్షల కోట్ల అప్పు వారసత్వంగా వచ్చిందని.. గత ప్రభుత్వం అమలు చేసిన ఏ ఒక్క కార్యకరమైనా తమ ప్రభుత్వం నిలిపివేసిందా? అని ప్రశ్నించారు.