ట్విట్టర్( X) వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ మొత్తాన్ని మోసం చేశావని, మీ “గ్యారంటీలు” చక్కటి ముద్రణ , ఖాళీ వాగ్దానాలతో నిండి ఉన్నాయి. మీరిచ్చిన గ్యారంటీ కార్డు లో షరతులు వర్తిస్తాయని విషయం తెలంగాణ అమాయక ప్రజలకు తెలియదన్నారు బండి సంజయ్.
Srinivas Goud : ఎన్ని అక్రమ కేసుల పెట్టినా భయ పడేది లేదని, సోయల్ మీడియాలో పోస్టులు పెడితే మా కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇవాళ మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కేసు నమోదు అయిన వరద భాస్కర్ కుటుంబాన్ని మేము పలకరించడానికి వెళితే భాస్కర్ తల్లి కన్నీరు పెట్టిందన్నారు. నన్ను చిత్రహింసలకు గురి చేశారని వరద భాస్కర్ మాతో ఆవేదన వ్యక్తం…
Balmuri Venkat : బీఆర్ఎస్ కి చెందిన ఓ ఆంబోతు ఏది పడితే అది మాట్లాడుతున్నాడంటూ ఎమ్మె్ల్సీ బల్మూరి వెంకట్ విమర్శలు గుప్పించారు. కొకైన్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎవరు.? పార్టీలో ఏం జరిగింది అనేది పక్కదారి పట్టిస్తున్నారని, 10 యేళ్ల నుండి కేటీఆర్ సన్నిహితులు డ్రగ్స్ వాడుతుంటారు కాబట్టి.. ఆయనకు కూడా అలవాటు ఉందని ఆరోపణలు వచ్చాయన్నారు. విజయ్ మద్దూరు చానా దగ్గర వ్యక్తులు అని కేటీఆర్ అంటున్నాడని, నీ సన్నిహితులు కొకైన్ తీసుకుంటే దాని…
హైడ్రా కూల్చివేతల భయం కారణంగా కూకట్ పల్లిలో ప్రాణాలు కోల్పోయిన బుచ్చమ్మ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అర్థం, పర్థం లేకుండా ఆనాలోచితంగా గుడ్డెద్దు చేలో పడినట్లు ఇష్టమొచ్చినట్లు కూకట్ పల్లిలోని నల్ల చెరువు వద్ద కూల్చివేతలు చేశారని ఆయన ఆరోపించారు. హైడ్రా అనే బ్లాక్ మెయిల్ సంస్థను పేదల మీదకు ఉసిగొల్పి…నోటీసులు ఇవ్వకుండానే మీ ఇళ్లు కూలగొడుతామంటూ భయానక వాతావారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిందని,…
నోటికి వచ్చినట్లు మాట్లాడటం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డికి తెలుసు అని, హామీలు అమలు చేయమని అడిగితే నోటికి వచ్చినట్లు సీఎం తిడుతున్నారన్నారు. కేసీఆర్ పధకాలను రేవంత్ రెడ్డి కొనసాగించడం లేదని, రెండు పంటలకు కేసీఆర్ రైతు బంధు ఇచ్చారని, రైతులకు రైతుబంధు రాలేదన్నారు. రాష్ట్రంలో పత్తి రైతులకు మద్దతు ధర రావడం లేదని హరీష్ రావు మండిపడ్డారు.
కేసీఆర్ తెలంగాణను అల్లకల్లోలం చేసి పోయిండు.. ఏడు లక్షల కోట్లు అప్పుచేసి పోయిండని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. ఇవాళ వికారాబాద్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. నెలకు రూ.7 వేల కోట్లు మిత్తి కడుతున్నామని, కేసీఆర్ ప్రభుత్వంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండే అని ఆయన వ్యాఖ్యానించారు.
నోటీసులకు నోటీసులతోనే సమాధానం చెప్తా అని ఆయన బండి సంజయ్ వెల్లడించారు. కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపిస్తా అని, కేటీఆర్ నీ అయ్య, నీ కుటుంబ సభ్యులు వచ్చి డ్రగ్స్ పై సంబంధం లేదని గుండె మీద చేయి వేసుకొని ప్రమాణం చేయమని చెప్పు అని ఆయన అన్నారు.
Not only Adani. But also Ambani: రాజకీయ నాయకుల అండదండల ద్వారానే బిజినెస్‌లో పైకొచ్చాడు తప్ప సొంత తెలివితేటలతో కాదనే విమర్శలు గౌతమ్ అదానీ ఒక్కడి పైనే రాలేదు. గతంలో.. రిలయెన్స్ అధినేత ధీరూబాయి అంబానీ కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. వాటిని సమర్థంగా తిప్పికొట్టారు. బిజినెస్‌లో బలంగా నిలబడ్డారు. అందువల్ల మన దేశంలో రాజకీయ పార్టీలు మారినా.. ప్రభుత్వాలు మారినా.. రిలయెన్స్ మాత్రం రోజురోజుకీ డెవలప్ అవుతోంది తప్ప డౌన్ కావట్లేదు.