Jagga Reddy : తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విమర్శలు, చురకలతో మార్మోగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో చర్చ జరగాలన్న సీఎం రేవంత్ రెడ్డి పిలుపుపై స్పందిస్తూ, బీఆర్ఎస్ నేతలు చర్చకు భయపడుతున్నారని, అసెంబ్లీని తప్పించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. “తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షాన్ని అసెంబ్లీ పెడతావా? చర్చించేది ఉంది అంటూ కోరుతుంటే, ఇక్కడ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ పెడతా, ప్రతిపక్ష…
ఏపీలో విద్యా వ్యవస్థపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.. రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ అని విమర్శించారు. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదన్నారు.
సుపరిపాలన కాదు సుద్దు దండగా పాలన అని మాజీ మంత్రి ఆర్‌కే ఆరోజా అన్నారు. రూ.1,60,000 కోట్లు అప్పు చేయడం సుపరిపాలన? అని ప్రశ్నించారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. "రూ. 81వేలకోట్లు ప్రజలకు ఎగనామం పెట్టడం సుపరిపాలన ? సూపర్ సిక్స్ అమలు చేయకపోవడమే సుపరిపాలన అంటారా? ఆడపిల్లను అత్యాచారాలు చేయడం చంపడం సుపరిపాలన ? రాష్ట్రం మొత్తం గంజాయి డ్రగ్స్ డోర్ డెలివరీ చేయడం, విద్యుత్ ఛార్జీలు పెంచడం సుపరిపాలన అంటారా? సీబీఎన్ అంటేనే…
వెన్నుపోటు దినోత్సవం కేవలం పనిలేక చేసినట్టు ఉందని.. కూటమి ప్రభుత్వం లో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేసిందన్నారు. ఏడాది కాలంలో పెన్షన్, అన్నక్యాటీన్, ఉచిత గ్యాస్ సిలిండర్, యువతకి డీఎస్సీ వంటి కార్యక్రమాలు చేసిందన్నారు. కేంద్రప్రభుత్వం సహకారంతో అమరావతి, పోలవరం, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ వంటి అసలు జరగవు అనుకున్న కార్యక్రమాలు చేసి చూపించామని తెలిపారు. ప్రతిపక్షానికి ఆనాడే…
సీపీఐ నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సనాతన ధర్మాన్ని విమర్శించే వారిని జైల్లో పెట్టాలనడం హాస్యాస్పదమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సనాతన ధర్మాన్ని సమర్థించే వారెవరయినా, పవన్ కళ్యాణ్ తో సహా శిక్షించాలి,అరెస్ట్ చేయాలని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం క్రూరమైనదని.. అరాచకమైనదన్నారు. సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు.. పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నారని ప్రశ్నించారు.
ఎంపీ సీఎం రమేష్ నాయుడు, ఆయన సోదరుడు సీఎం సురేష్ నాయుడుపై పొట్లదుర్తి గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సొంత గ్రామం కోసం సీఎం రమేష్ ఎంపీగా ఒక్క మంచి పని అయినా చేశారా? అని ప్రశ్నించారు. ఎంపీగా సొంత గ్రామంలో ఒక్క అభివృద్ధి పని చేశావా? అంటూ నిలదీశారు.. సొంత సామాజిక వర్గానికి కూడా న్యాయం చేయలేదన్నారు. కాంట్రాక్టు పేరుతో పనులు చేస్తామని చెప్పి బిల్లులు మంజూరు చేయించుకుంటున్నారన్నారు.
రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ అరాచక, మోసపూరిత పాలనకు జూన్ 4కు ఏడాది అవుతుందని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు.. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఏడాదిలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. ప్రశ్నించే గొంతులు లేవకుండా భయోత్పాతాన్ని సృష్టించిన ప్రభుత్వం దేశ చరిత్రలోనే ఉండదన్నారు.
Harish Rao : కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం నిర్మాణంపై ఇష్టారీతిగా వ్యాఖ్యానిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మతి భ్రమించినట్టే కనిపిస్తుందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఒకే అబద్దాన్ని పదే పదే చెబితే ప్రజలు నమ్ముతారన్న భ్రమలో ఉన్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లు, పంప్హౌజ్లను వాడుకుంటూనే ప్రాజెక్టును ‘వైట్…
KTR : తెలంగాణ రాజకీయ వేడి మరోసారి పెరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వ్యక్తిగత దూషణలు, విమర్శలు వచ్చినా సహించామని, కానీ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తట్టుకోలేక ఈ ప్రెస్మీట్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సాధనలో విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు పార్టీలకతీతంగా పాల్గొన్నా వాస్తవాన్ని గుర్తుచేస్తూ, అలాంటి నేతలపై ముఖ్యమంత్రి చేసిన…