కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు ప్రాజెక్టులు కూలిపోయాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లాలోని చిన్నకొడుర్ మండలం చౌడారం వద్ద బిక్కబండకు వెళ్లే కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం కాలువల భూ సేకరణ కోసం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు.
READ MORE: ‘Stree’ : నా నవ్వు అలానే ఉంటుంది.. అందుకే ఈ క్యారెక్టర్ కు తీసుకున్నారు: అమర్ కౌశిక్
కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని, ప్రాజెక్టుల్లో నీరు ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా నీటిని విడుదల చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. రైతులపై ప్రేమతో పనిచేయాల్సిన అవసరం ఉందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పగతో వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉత్తర తెలంగాణకు అద్భుతమైన ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్లే పలు కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని హరీష్ రావు చెప్పారు..
READ MORE: ‘Stree’ : నా నవ్వు అలానే ఉంటుంది.. అందుకే ఈ క్యారెక్టర్ కు తీసుకున్నారు: అమర్ కౌశిక్