KTR : రేవంత్ రెడ్డి మాటలు చూస్తే చేతకాని వాడు అని తేలిపోయింది..
- ఉద్యమ నాయకులపై విమర్శలు తగవు
- కాంగ్రెస్ హామీలు శతాబ్దపు అబద్ధం
- కేసీఆర్ నుంచి అభివృద్ధి రాష్ట్రం, రేవంత్ చేతిలో అస్తవ్యస్తం : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : తెలంగాణ రాజకీయ వేడి మరోసారి పెరిగింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వ్యక్తిగత దూషణలు, విమర్శలు వచ్చినా సహించామని, కానీ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తట్టుకోలేక ఈ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సాధనలో విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు పార్టీలకతీతంగా పాల్గొన్నా వాస్తవాన్ని గుర్తుచేస్తూ, అలాంటి నేతలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయని అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు ఆయన పాలనాపరమైన అనుభవ లేకపోయినదాని సూచనగా ఉందని విమర్శించారు కేటీఆర్.
Health Tips: తేనె ఆరోగ్యానికి, అందానికి వరం.. ప్రతి రోజు స్పూన్ చాలు
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజలను మోసం చేసే అబద్ధాలుగా తేలిపోయాయని, తాము ఎప్పటి నుంచో ఢిల్లీ పార్టీలను నమ్మరాదని చెబుతున్నామని, రేవంత్ రెడ్డి మాటలు దివాలా కోరి వానిలా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ అధికారం ఉన్నప్పటికీ, పలు హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ ప్రకారం, ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాలు, ముఖ్యంగా NGOలు కీలకంగా కదం తొక్కాయి. వారి పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే ఉద్యమ నేతలకు గౌరవంగా ఉన్నత జీతాలు కల్పించామన్నారు. రేవంత్ రెడ్డి ఉద్యమంలో భాగం కాలేదని, ఉద్యమ ద్రోహిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పు మొత్తం 4.15 లక్షల కోట్లకే పరిమితమని, ప్రభుత్వం నుండి విరమించిన సమయంలో ఆదాయం నెలకు 18 వేల కోట్లు ఉందని వివరించారు. ఇప్పుడూ అదే ఆదాయం వస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించలేకపోతోందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ అప్పు లెక్కల్ని గందరగోళంగా మార్చుతున్నారని, ఒకసారి 6 లక్షల కోట్లు, తర్వాత 8.29 లక్షల కోట్లు అన్నారు అంటూ లెక్కల్లో అస్పష్టత ఉన్నదని చెప్పారు.
రైతు బంధు, విద్యుత్ సరఫరా, నీటి కొరత వంటి అంశాల్లో కేసీఆర్ హయాంలో స్థిరత ఉందని, ఇప్పుడు అన్ని రంగాల్లో సంక్షోభం నెలకొంది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని విమర్శలు గుప్పించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి, ఇప్పుడు వారినే ప్రజల ముందుకు విలన్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టిన కేసీఆర్ పాలన తరువాత ఇప్పుడు విపరీత పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజలు ఈ పరిస్థితిని గమనిస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!