Larissa Brazilian model: హర్యానాలో 2.5 మిలియన్ల నకిలీ ఓటర్లు ఉన్నారని రాహుల్ గాంధీ నవంబర్ 5న జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే. బ్రెజిలియన్ మోడల్ ఫోటోను ఉటంకిస్తూ.. ఆ చిత్రాన్ని వేర్వేరు పేర్లతో 22 సార్లు ఉపయోగించారని ఆరోపించారు. ఓటర్ల జాబితా కుంభకోణానికి సంబంధించి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రస్తావించిన బ్రెజిలియన్ మోడల్ ఓ ప్రకటన విడుదల చేసింది. తనకు భారత రాజకీయాలతో సంబంధం లేదని ఆమె పేర్కొంది. ఎవరో ఆమె…
Phone Tapping Row: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు కేంద్రమంత్రి సవాల్ విసిరారు.
కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై పార్టీ హైకమాండ్‌కు చర్య తీసుకునే అధికారం ఉందని స్పష్టం చేశారు. అక్టోబర్‌లో ముఖ్యమంత్రి మార్పుపై రాష్ట్రంలో ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఈ అంశాన్ని తాజాగా మీడియా ప్రతినిధులు ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ముఖ్యమంత్రి మార్పు నిర్ణయం పార్టీ హైకమాండ్ చేతిలో ఉంది.
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. కోర్టులో హాజరుపరచే ముందు.. వైద్య పరీక్షల కోసం ఎంజీఎంకు తరలించారు. ఆస్పత్రిలోకి వెళ్లే ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదు.. ఈ కాంగ్రెస్ సర్కార్ 20% కమీషన్ సర్కార్.. పోలీస్ ఆఫీసర్ల దగ్గర కమీషన్స్ తీసుకుంటున్నారు ఎమ్మెల్యే నాగరాజు.. అక్రమ మైనింగ్ చేస్తున్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోకపోవడం హాస్యస్పదం.." అని వ్యాఖ్యానించారు. అంతలోపే…
సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన ఇంకా కశ్మీర్ సమస్య అలాగే ఉంది అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. కశ్మీర్ కి స్వతంత్రపతిపత్తి ఇచ్చి వివాదానికి ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆనాడు ఇందిర గాంధీ పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకొని ఉంటే ఈనాడు భారత్ దేశానికి ఈ పరిస్థితి వచ్చి ఉండేదా ? అని నిలదీశారు.