Assam CM Controversy: అస్సాం సీఎంపై హైదరాబాద్‌లో కేసు.. రంగంలోకి అసదుద్దీన్ ఓవైసీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam CM Controversy: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై హైదరాబాద్ పోలీసులకు AIMIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అనంతరం అస్సాం బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోను తొలగించారు. ఆ వీడియోలో అస్సాం ముఖ్యమంత్రి ముస్లింలను “కాల్చివేస్తున్నట్లు” చూపించారు, దీనిని AIMIM చీఫ్ హింసాత్మకం, రెచ్చగొట్టేదిగా ఉందని అభివర్ణించారు.
READ ALSO: Tharun Bhascker : తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ రచ్చ!
Also Read
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
ఈ వీడియో విషయంలో ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఓవైసీ డిమాండ్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఆయన ఒక పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ పోస్ట్‌లో.. దురదృష్టవశాత్తు, జాతి విద్వేష ప్రసంగం ఇప్పుడు సర్వసాధారణమైపోయిందని రాసుకొచ్చారు.
వీడియోను తొలగించిన బీజేపీ
వివాదానికి కారణమైన వీడియో అస్సాం బీజేపీ అధికారిక హ్యాండిల్ నుంచి పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోపై వివాదం చెలరేగడంతో, ఆ వీడియోను అసదుద్దీన్ ఓవైసీ ఫిర్యాదు అనంతరం, అస్సాం బీజేపీ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి తొలగించారు. ఈ వీడియోలో చూపించిన కంటెంట్ హింసాత్మకంగా ఉండటమే కాకుండా ముస్లిం సమాజాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు ఓవైసీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓవైసీ హైదరాబాద్‌లో దాఖలు చేసిన ఫిర్యాదులో.. అస్సాం ముఖ్యమంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ద్వేషపూరిత ప్రసంగం, హింసను ప్రేరేపించే చర్యలను అరికట్టాలని ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను కోరారు. ఇది సామాజిక శాంతికి తీవ్ర ముప్పుగా ఓవైసీ అభివర్ణించారు.
I have lodged an official complaint with @CPHydCity demanding criminal action against Himanta Sarma for his (now deleted) violent video showing him shooting Muslims. Unfortunately, genocidal hate speech has become a norm. pic.twitter.com/o1OVUl6MWk
— Asaduddin Owaisi (@asadowaisi) February 9, 2026
READ ALSO: RC17 Update: బిగ్ సర్‌ప్రైజ్.. ఈసారి అంతకుమించి, రెండు భాగాలుగా..!
తాజావార్తలు
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!