Karnataka: కర్ణాటకలో సీఎం మార్పు పుకార్లు.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు..!
- కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై రచ్చ
- పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు
- ఈ అంశంపై హైకమాండ్ చర్యలు తీసుకుంటుంది
- హైకమాండ్‌లో ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు
- కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై పార్టీ హైకమాండ్‌కు చర్య తీసుకునే అధికారం ఉందని స్పష్టం చేశారు. అక్టోబర్‌లో ముఖ్యమంత్రి మార్పుపై రాష్ట్రంలో ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఈ అంశాన్ని తాజాగా మీడియా ప్రతినిధులు ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి మార్పు నిర్ణయం పార్టీ హైకమాండ్ చేతిలో ఉంది. హైకమాండ్‌లో ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఈ నిర్ణయాన్ని హైకమాండ్‌కే వదిలేయాలి. కానీ ఎవరూ అనవసరంగా సమస్యలు సృష్టించడానికి ప్రతయత్నించకూడదు.” అని ఖర్గే వ్యాఖ్యానించారు.
READ MORE: Kannappa Movie: ఊహకు మించి ‘కన్నప్ప’.. ‘మైల్ స్టోన్’ చిత్రం అవుతుంది: డిప్యూటీ సీఎం
Also Read
- DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
- BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
- Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
- Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్‌పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వ మార్పు జరుగుతుందనే ఊహాగానాల మధ్య. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన “హైకమాండ్” వ్యాఖ్యపై బీజేపీ వ్యాంగంగా స్పందించింది. ఖర్గే కాకపోతే “పార్టీ హైకమాండ్” ఎవరు అని యంగ్ ఎంపీ తేజస్వీ సూర్య ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు చాలా వింతగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో ఓ పోస్ట్ చేశారు. ‘‘కాంగ్రెస్ హైకమాండ్ రూపురేఖలు లేనిది. అది ఎవరికీ కనిపించదు, వినిపించదు. కానీ అది ఉన్నట్లు అందరూ అనుభూతి చెందుతారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ అధిష్ఠానం అని ప్రజలు భావిస్తున్న పార్టీ అధ్యక్షుడు కూడా అది తాను కానని అంటున్నారు’’ అని రాసుకొచ్చారు.
READ MORE: MLA Raja Singh: టీడీపీ నుంచి బీజేపీకి.. రాజా సింగ్ రాజకీయ ప్రస్థానంపై ఓ లుక్కేయండి..
కాగా.. ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనకు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు మధ్య విభేదాలు ఉన్నాయనే పుకార్లను తోసిపుచ్చారు. ” డీకే శివకుమార్, నేను కలిసే ఉన్నాం. ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు శిలలాగా చెక్కుచెదరకుండా ఉంటుంది. బీజేపీ అబద్ధాలకు పేరుగాంచింది. వాళ్లు చేసే వ్యాఖ్యలపై మేము స్పందించము.” అని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
-
BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
-
Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
-
Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్‌పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?