ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై నేడు మరో నివేదికను సిట్ ఇవ్వనుంది. సోమవారం ఇచ్చిన ప్రాథమిక నివేదికలోనే.. కీలక సిఫార్సులు, గుర్తించిన అంశాలు పొందుపర్చింది. ప్రస్తుతానికి 2 రోజుల విచారణ ముగిసినప్పటికీ.. కేసులపై పర్యవేక్షణ ఇకపై కూడా చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ కి ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందంటూ అలర్ట్ చేసింది. కౌంటింగ్ కు ముందు, తర్వాత దాడులు జరిగే ఛాన్స్ ఉందని ఎన్నికల కమిషన్ కు నిఘా వర్గాలు నివేదికను ఇచ్చాయి.
తూర్పు గోదావరి జిల్లాలోని రాజా నగరంలో గల ఈవీఎంలు భద్రత పరిచిన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీని నో మేన్ జోన్ గా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మధవీ లత ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాయుధ బలగాల ఆధీనంలో క్యాంపస్ ఉంటుందని తెలిపారు. వచ్చే నెల 6వ తేదీ వరకూ యూనివర్సిటీ బోధన, పాలనా కార్యకలాపాలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఎన్నికల సమయంలో, పల్నాడు జిల్లాలో పోలీసు వ్యవస్థ దారుణంగా ఫెయిల్ అయిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లాలో సిట్ బృందం పర్యటిస్తోందని..ఆ బృందాన్ని కలిసి తాను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తొండపి అనే గ్రామంలో ఘర్షణల తో ఊరు ఊరంతా వలస పోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు.
తమకు పెళ్లి జరిపించాలని వచ్చిన ఓ ప్రేమజంటకు పోలీసులు అనుకోని షాకిచ్చారు. ఉత్తర్ ప్రదేశ్‌లో గురువారం ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. తన ప్రేమికుడినే పెళ్లి చేసుకుంటానంటూ దరఖాస్తు ఇచ్చింది. అయితే.. ఇంతలో అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. తమ బిడ్డను కావాలని తీసుకొచ్చాడని పోలీసులకు తెలిపింది. దీంతో.. పోలీసులు అమ్మాయిని తల్లికి అప్పగించారు. కాగా.. ప్రేమికుడిపై శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు చర్యలు తీసుకున్నారు.
Haryana : హర్యానాలోని నుహ్‌లోని తవాడ సమీపంలోని మనేసర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో నిండిన టూరిస్ట్ బస్సులో మంటలు చెలరేగాయి.
Gujarat : గుజరాత్‌లోని వడోదరకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఇద్దరు యువకులు కుక్కను భవనంపై నుండి క్రిందికి విసిరివేస్తున్నారు.
Sexual Harassment: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కామారెడ్డి డీఎంహెచ్ఓ లక్ష్మణ్‌సింగ్, సూపరింటెండెంట్ శ్రీనునాయక్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.