పల్నాడు జిల్లాలో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎన్నికల ఘర్షణలలో దాడులకు పాల్పడ్డ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. నిన్న పల్నాడు జిల్లాలో 60 మందికి పైగా అరెస్ట్ చేశారు. సిట్ టీమ్ దర్యాప్తు నేపథ్యంలో మరో 13 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
ఏపీలో ఎన్నికల సమయంలో ఘర్షణలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. తిరుపతి, పల్నాడు, తాడిపత్రిలోనే సిట్ అధికారులు మకాం వేసింది. అవసరమైతే మరోసారి అల్లర్లు జరిగిన ప్రాంతానికి సిట్ టీమ్ వెళ్లనుంది. జిల్లాల్లో పోలీసులు కేసులు విచారిస్తున్న తీరుపై సిట్ మరో నివేదిక ఇచ్చే అవకాశం కూడా ఉంది.
గ్రామంలో పలుకుబడి ఉన్న ఓ వ్యక్తి కుమార్తె వివాహంలో కొందరు వ్యక్తులు రచ్చ చేశారు. సరదాగా డీజే పాటలకు డ్యాన్స్ చేస్తున్న వధువు తరఫు మహిళలతో కలిసి కొందరు పోకిరీలు మధ్యలో వచ్చి వారితో బలవంతంగా డ్యాన్స్ చేయించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో.. ఓ మహిళ నేలపై పడిపోయింది. అయితే.. పక్కనున్న కొంతమంది గమనించి వారిని అక్కడి నుంచి పంపించారు. అంతటితో ఆగకుండా.. పోరంబోకులు వివాహ ఊరేగింపుపై దాడి చేశారు. పెళ్లికి వచ్చిన బంధువులను కర్రలతో వెంబడించి…
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా ఈ మెయిల్ బెదిరింపు కాల్స్ రావడం అధికారుల్ని పరుగులు పెట్టిస్తోంది. మరోవైపు ప్రజలు కూడా బెంబేలెత్తిపోతున్నారు.
బ్యాగ్‌లు అమ్మే నెపంతో ఓ ఇంట్లోకి నిశ్శబ్దంగా లోపలికి ప్రవేశించిన దొంగ.. చిన్నారిని చంకలో పెట్టుకుని పారిపోయాడు. స్థానికులు అతని కోసం వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని రుద్రనగర్ లో చోటు చేసుకుంది. ఈ విషయంపై చిన్నారి తల్లి షీలా బధోయ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాము కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని తెలిపింది.
హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణ గుట్ట, బండ్లగూడ ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు కర్ణాటక రాష్ట్రంలోని కమలాపూర్ చెడుగుప్ప ప్రాంతానికి వెళ్లారు. ఫుల్లుగా మద్యం తాగిన తర్వాత మత్తులో నలుగురు నదిలో స్నానం చేసేందుకు దిగారు.
ఉత్తరాఖండ్‌లో గంజాయి స్మగ్లింగ్ బ్లాక్ వ్యాపారాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. మంగోలి ప్రాంతంలో 31.99 గ్రాముల గంజాయి తరలిస్తున్న బరేలీకి చెందిన స్మగ్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఈశాన్య ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై సిరా విసిరిన నిందితుడు అజయ్‌కుమార్ (41)ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు నార్త్ ఈస్ట్ డీసీపీ జాయ్ టిర్కీ సమాచారం అందించారు. కాగా.. మే 17న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో కన్హయ్య కుమార్‌పై ఇంక్ విసిరి, చెంపదెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. కొందరు వ్యక్తులు కన్హయ్యకు పూలమాల వేస్తానన్న సాకుతో వచ్చి చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారు.
ఎన్నికల సందర్భంగా పల్నాడులో జరిగిన ఘర్షణలపై పోలీసులు సమగ్ర విచారణ చేయాలి అని ఎంపీ అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు అన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని పల్నాడు లో అరాచకం చేశారు.. టీడీపీ, అధికారులు కుమ్మక్కు అయ్యారన్న ఆరోపణలు అవాస్తవం అని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో అల్లర్లు జరుగుతాయనే సమాచారంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఇక, పల్నాడు జిల్లాలో పోలీసులను కౌంటింగ్ ప్రక్రియ టెన్షన్ పెడుతుంది.