Gas Refilling Fraud: ప్రస్తుత కాలంలో ఇష్టానుసారంగా అక్రమాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. వివిధ ఆదాయ మార్గాలను కనుగొనే విషయానికి వస్తే, కొంతమంది స్కామర్లు కష్టపడుతున్నారు. అదే క్రమంలో గ్యాస్ వినియోగంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండటం కూడా చాలా ముఖ్యం. కొందరు మాత్రం గ్యాస్ విషయంలో ఎలాంటి భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తూ తమకు కావాల్సినంత సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతులు లేకుండా ఇలా అక్రమంగా రీఫిల్లింగ్ చేయడం నేరమని అధికారులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా పట్టించుకోని వారే ఎక్కువ. డబ్బుకు ఆశపడి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు.
Read also: MLC Polling: ఎమ్మెల్సీ పోలింగ్ ఏర్పాట్లు.. అక్కడ భద్రత కట్టుదిట్టం..
తాజాగా హైదరాబాద్ మహా నగరం శివారులోని జలపల్లి లో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కుంభకోణం వెలుగు చూసింది. గో గ్యాస్ వాణిజ్య సిలిండర్లను భారత్, ఇండేన్ సిలిండర్లుగా మార్చి మోసగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ప్రమాదకరమైన అక్రమ వ్యాపారం ప్రజల మధ్య సాగుతోంది. నివాస ప్రాంతం మధ్యలో ఉన్న అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ ప్లాంట్, ఏ నిమిషంలో ఏం జరుగుతుందో అంటూ ఇరుగుపొరుగు వారు భయాందోళన చెందుతున్నారు. అక్కడున్న ప్రజలకే కాదు.. వాస్తవానికి రీఫిల్ చేస్తున్న వారి జీవితాలు కూడా ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు. అయితే దీనిపై కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై సమాచారం అందుకున్న మహేశ్వరం ఎస్వోటీ పోలీసులు దాడి చేసి 100 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ దాడులకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేశారు. అనంతరం వారిని పహాడిష్రీఫ్ పోలీసులకు అప్పగించారు.
Devotees to Temples: ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి నాలుగు గంటల సమయం