కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సంఘటన ప్రదేశంలోనే నలుగురు దుర్మరణం చెందారు. మరో వ్యక్తి తీవ్రగాయాలు అయ్యాయి.
తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కొంగరవారి పల్లి దగ్గర ఓ కారు అదుపు తప్పి కల్వర్ట్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సంఘటన ప్రదేశంలోనే నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక హస్పటల్ కు తరలించారు.
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ 15 ఏళ్ల యువకుడిపై పలుమార్లు అత్యాచారం చేశాడు 46 ఏళ్ల వ్యక్తి. అయితే ఆ వ్యక్తిని బాలుడు హత్య చేశాడు. అనంతరం బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హకీమ్ నజాకత్ అనే వ్యక్తి అసభ్యకరమైన వీడియోను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేయడంతో యువకుడు కత్తితో పొడిచి హతమార్చాడు. వివరాల్లోకి వెళ్తే.. మే 19న నజకత్ భార్య, అతని పిల్లలు తన…
Gas Refilling Fraud: ప్రస్తుత కాలంలో ఇష్టానుసారంగా అక్రమాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. అదే క్రమంలో గ్యాస్ వినియోగంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండటం కూడా చాలా ముఖ్యం.
ఢిల్లీలోని వివేక్ విహార్‌లోని రెండంతస్తుల బేబీ డే కేర్ సెంటర్లో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ కేంద్రంలో 11 మంది నవజాత శిశువులు జాయిన్ అయ్యారు. అయితే, షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చేలరేగడంతో ఆరుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడి మరణించారు.
Rajkot Massive Fire : ఇనుప స్థంభాలు, టిన్ షెడ్, చిన్న గోడలు... టీఆర్పీ గేమ్‌జోన్‌లో ఇదొక్కటే మిగిలి ఉంది. మిగతావన్నీ బూడిద పాలయ్యాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది చిన్నారులు సహా 28 మంది మరణించారు.
Delhi : దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కేరళకు చెందిన ఓ యువకుడు ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్‌లోని గ్రెనో వెస్ట్ ఏజెన్సీలో అద్దెకు తీసుకున్న ల్యాప్‌టాప్‌ను విక్రయించాడు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు తీవ్రంగా కలచి వేస్తున్నాయి. అమ్మాయి ప్రేమించడం లేదనో, ప్రేమించిన అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లాడిందనో, పెద్దలు తమ ప్రేమను అంగీకరించడం లేదనో ఇలా ప్రేమ పేరుతో రకరకాల కారణాల వల్ల యువతీ యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
బీఆర్ఎస్ మాజీ జీవన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. అతడితో పాటు అతని కుటుంబ సభ్యుల పై చేవెళ్ల పీఎస్ లో కేసు నమోదైంది. దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన భూమిని కబ్జా చేశారని బాధితుడు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఎర్లపల్లి లో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో కొనుగోలు చేశారు.
రాష్ట్ర ప్రధాన పార్టీలూ అన్ని కలిపి 10 వేల కోట్లు ఖర్చు పెట్టారు.. ఎలక్షన్ కమిషన్ కూడా అమ్మడు పోయింది.. పిన్నెలి తప్పు చేసాడు కాబట్టే గన్ మెన్ లను సైతం విడిచి పెట్టి రాష్ట్రం వదలి పరారి అయాడు అని పోలీసులే గంజాయి అమ్మిస్తున్నారు అని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు.