గ్రామంలో పలుకుబడి ఉన్న ఓ వ్యక్తి కుమార్తె వివాహంలో కొందరు వ్యక్తులు రచ్చ చేశారు. సరదాగా డీజే పాటలకు డ్యాన్స్ చేస్తున్న వధువు తరఫు మహిళలతో కలిసి కొందరు పోకిరీలు మధ్యలో వచ్చి వారితో బలవంతంగా డ్యాన్స్ చేయించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో.. ఓ మహిళ నేలపై పడిపోయింది. అయితే.. పక్కనున్న కొంతమంది గమనించి వారిని అక్కడి నుంచి పంపించారు. అంతటితో ఆగకుండా.. పోరంబోకులు వివాహ ఊరేగింపుపై దాడి చేశారు. పెళ్లికి వచ్చిన బంధువులను కర్రలతో వెంబడించి మరీ కొట్టారు. అంతేకాకుండా.. కాల్పులు కూడా జరిగాయి. ఈ క్రమంలో.. వధువు తరుఫున ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి.
Treatment With Torch Lighting: విద్యుత్ నిలిచిపోవడంతో ఫోన్ లైట్స్ తో రోగులకు చికిత్స..
వివరాల్లోకి వెళ్తే.. షాజహాన్ పూర్ గ్రామానికి చెందిన పెద్దాయన కుమార్తె వివాహం బుధవారం జరిగింది. పెళ్లి ఊరేగింపు వచ్చే సమయంలో ఇంటి వద్ద బంధువులు, మహిళలు డీజే పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు. ఇంతలో గ్రామానికి చెందిన అమిత్ సింగ్, ప్రమోద్ సింగ్, రాంపాల్ సింగ్, సోనూ సింగ్, అవనీష్, గుడ్డు, సునీల్ తదితరులు అక్కడికి వచ్చి డ్యాన్స్ చేస్తూ మహిళలను వేధించడం ప్రారంభించారు. వారు అడ్డుకుని దుర్భాషలాడారు. పెళ్లికి వచ్చిన బంధువులు నిందితులను అక్కడి నుంచి పంపించారు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో పెళ్లి ఊరేగింపుగా వస్తున్న వారిపై నిందితులు కర్రలతో దాడి చేశారు.
Planet Parade: ఆకాశంలో అద్భుతం.. జూన్ 3న ఒకే వరసలోకి ఆరు గ్రహాలు..
పెళ్లికి వచ్చిన అతిథులపై రాళ్లు రువ్వడం, కాల్పులు జరిపారు. నిందితులు కొన్ని బైక్‌లను కూడా ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగానే నిందితులు పరారయ్యారు. ఈ ఘటనతో అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డాయి. అనంతరం పోలీసుల సమక్షంలో ఊరేగింపును పూర్తి చేశారు. ఈ ఘటనతో తన కుటుంబ సభ్యులు భయపడుతున్నారని.. తమ కుటుంబానికి రక్షణ కల్పించాల్సిందిగా పెద్దాయన పోలీసులను కోరారు. మరోవైపు.. క్షతగాత్రులను ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించినట్లు ఇన్‌చార్జి అశ్వనీ కుమార్ సింగ్ తెలిపారు. నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని.. వారిని వెతికిపట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలో అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు.